Upasana Konidela : ఆ హీరో అంటే ఉపాసన కి అంత కోపం ఉండడానికి కారణం అదేనా..?

Posted by venditeravaartha, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Akkineni Akhil : రామ్ చరణ్ భార్య గా, మెగా కోడలిగా ఉపాసన కి ఇండస్ట్రీ లో ఎంత మంచి పేరు, గౌరవం ఉందో మన అందరికీ తెలిసిందే. అపోలో హాస్పిటల్స్ ఛైర్మెన్ గా ఎప్పుడూ ఆమె సమాజానికి ఉపయోగపడే మాటలు, ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన టిప్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియచేస్తూ ఉంటుంది. అలాగే సోషల్ సర్వీస్ చెయ్యడం లో కూడా ఈమె ఎప్పుడూ ముందు ఉంటుంది.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈమె ఒక పాప కి జన్మనిచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. క్లిన్ కారా పేరుతో పిలవబడుతున్న ఆ పాప కి సంబంధించిన ఫోటోలు ఇప్పటి వరకు బయటకి రానివ్వలేదు. అయితే క్లిన్ కారా పుట్టకముందు రామ్ చరణ్ ఉపాసన కలిసి ఇండస్ట్రీ లో ఉన్న మిత్రులందరికీ స్పెషల్ పార్టీ ని ఇచ్చారట. ఈ పార్టీ కి రామ్ చరణ్ కి సన్నిహితంగా ఉండే అందరూ వచ్చారు కానీ, అక్కినేని అఖిల్ మాత్రం రాలేదట.

కారణం అక్కినేని అఖిల్ అంటే ఉపాసన కి మొదటి నుండి ఇష్టం లేదట. అఖిల్ రామ్ చరణ్ కి మంచి స్నేహితుడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కి స్నేహితుడే కానీ, ఉపాసన మాత్రం అతనితో కలవడానికి ఇష్టం చూపేది కాదట. కారణం అప్పట్లో అఖిల్ కి శ్రియా భూపాల్ అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయ్యింది. వీళ్లిద్దరి ఎంగేజ్మెంట్ కుటుంబసభ్యుల సమక్ష్యం లో జరిగింది. కానీ పెళ్లి మాత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఉపాసన కి మొదటి నుండి శ్రియా భూపాల్ మంచి స్నేహితురాలు.

చిన్నతనం నుండి ఇద్దరు ఒక్కే స్కూల్, ఒకే కాలేజీ లో చదువుకున్నారు. ఇద్దరు బయట మంచి స్నేహితులు అవ్వడం, తన స్నేహితురాలికి అన్యాయం జరగడం, పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి అఖిల్ కారణం అనే విషయం తెలియడం వల్లే ఆమె అఖిల్ పై కోపం పెంచుకుందని, అందుకే అప్పటి నుండి అఖిల్ ని కలిసేందుకు ఇష్టపడేది కాదని తెలుస్తుంది. ఉపాసన కి ఇండస్ట్రీ లో అందరితో మంచి స్నేహం ఉంది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా ప్రతీ కుటుంబం తో ఎంతో సాన్నిహిత్యం ని మైంటైన్ చేస్తూ వచ్చే ఉపాసన, అఖిల్ కి మాత్రం దూరం గా ఉంటుంది. భవిష్యత్తులో కూడా క్షమించే అవకాశాలు ఉండవని తెలుస్తుంది.

278 views