Prabhas: ప్రభాస్ సినిమాల్లోకి రాకముందు ఆ స్టార్ హీరో సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడా?

Posted by venditeravaartha, February 25, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Prabhas : ప్రస్తుతం ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో రెబెల్ స్టార్ పేరు కచ్చితంగా ఉంటుంది. కృష్ణం రాజు తమ్ముడు కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ‘వర్షం’ సినిమాతో తొలి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని తన సత్తా చాటాడు.

ఆ తర్వాత ‘ఛత్రపతి’ సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేసే రేంజ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని స్టార్ హీరో గా మారాడు. ఈ సినిమా తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాలిసిన అవసరం రాలేదు. ఛత్రపతి చిత్రం తర్వాత ప్రభాస్ కి సరైన హిట్ పడడానికి చాలా సమయమే పట్టింది కానీ, ‘బాహుబలి’ సిరీస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ గా మారాడు. ఇప్పుడు ఆయన అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా కనీసం 300 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసే స్థాయికి వచ్చింది.

ఇదంతా పక్కన పెడితే సినిమాల్లోకి అడుగుపెట్టే ముందు ప్రభాస్ సత్యానంద్ దగ్గర నటనలో, డైరెక్షన్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే సత్యానంద్ ట్రైనింగ్ మొత్తం చాలా ప్రాక్టికల్ గా ఉండేది. నటన విషయం లో కానీ, దర్శకత్వం విషయం లో కానీ సత్యానంద్ చాలా లైవ్ ఉదాహారణలతో తన శిష్యులకు నేర్పించేవాడు. అలా ప్రభాస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ మీద సత్యానంద్ వద్ద పట్టు సాధించుకుంటున్న రోజుల్లో రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించే ఒక సినిమాకి ప్రభాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యమని చెప్పాడట.

సత్యానంద్ ఆదేశానుసారం ప్రభాస్ అప్పట్లో రాఘవేంద్ర రావు దర్శకత్వం లో తెరకెక్కిన ‘పరదేశి’ అనే చిత్రానికి ప్రభాస్ అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని రోజులు వ్యవహరించాడట. ఈ విషయం చాలామందికి ఇప్పటి వరకు తెలియదు. ప్రభాస్ ని ఒక సినిమా హీరో గా మాత్రమే చూస్తూ వచ్చారు కానీ, ఆయనలో ఈ యాంగిల్ కూడా ఉందనే విషయం మాత్రం ఎవరూ గమనించలేదు. కేవలం ప్రభాస్ కి మాత్రమే కాదు, ఇండస్ట్రీ లో యాక్టింగ్ కోచింగ్ కి వచ్చిన ప్రతీ హీరో కి అన్నీ క్రాఫ్ట్స్ పై అవగాహనా కలిపించేలా ట్రైనింగ్ ఇస్తారట. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం కల్కి అనే చిత్రం లో హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది మే 9 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

235 views