హీరోయిన్ వినీత్ భార్య ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా..? స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు!

Posted by venditeravaartha, February 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

వినీత్ అనగానే గుర్తొచ్చేది 90 నాటిలో వచ్చిన ప్రేమ దేశం సినిమా తెలుగు లో తక్కువ సినిమాలో నటించిన అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో వినీత్ అనే చెప్పాలి. తెలుగు లో తన మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దెగ్గరయ్యారు. తమిళ, మలయాళ సినిమాలో చాలా సినిమాలు చేసినప్పటికీ తెలుగు లో వచ్చిన మొదటి సినిమా సరిగమలు ఆ సినిమా విడుదలై ఇప్పటికి 30 ఏళ్ళు అవుతుంది, ఆ సినిమాలో పాటలు అప్పటి ఇప్పటికి అద్భుతం అని చెప్పచు, కుటుంబం లో ప్రముఖ డాన్సర్స్, స్టార్ హీరోయిన్స్ ఉన్న సొంత టాలెంట్ తో సినిమాలోకి వచ్చారు, తెలుగు, తమిళ్,హిందీ,మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషలో 100 పైగా సినిమాలో నటించి తన టాలెంట్ ని నిరూపించుకున్నాడు, వినీత్ ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలోని తలస్సేరీలో 23 ఆగష్టు 1969న కే.టి. రాధాకృష్ణన్ మరియు ఫై.కే. శాంతకుమారి దంపతులకు జన్మించాడు.

వినీత్ కి కవిత దినేష్ సోదరి ఉంది. వినీత్ గుడ్ షెపర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఊటీ ,సెయింట్ జోసెఫ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్, తలస్సేరీ మరియు దేవగిరి కాలేజీ, కోజికోడ్ లో వినీత్ 1991లో ది న్యూ కాలేజీ నుండి బ్యాచిలర్ అఫ్ కామర్స్ పూర్తిచేశారు, అందరికి తెలియని విషయం ఏంటంటే వినీత్ ట్రావెన్‌కోర్ సోదరమణుల నటి పద్మిని భర్త రామచంద్రన్ నాయర్ మేనల్లుడు, అతని అత్తా పద్మిని మరియు ఆమె సోదరి, రాగిణి అతనిని డాన్స్ స్కూల్ కి పంపమని అతని తల్లితండ్రులను ఒప్పించారు. వినీత్ 6 ఏళ్ళ వయసు నుండే భారతనాట్యంలో శిక్షణ ప్రారంభించాడు మరియు విద్యార్థిగా ఉన్నపుడు అనేక అవార్డ్స్ కూడా గెల్చుకున్నాడు వరసగా 4 సంవత్సరాలు కేరళ స్కూల్ కలోల్సవంలో మొదటి బహుమతితో సహా 1986 లో “కళాప్రతిభ” టైటిల్ గెలుచుకున్నాడు అది మాత్రమే కాదు 2 కేరళ స్టేట్ ఫిలిం అవార్డ్స్ గెల్చుకున్నారు.

తమిళనాడు ప్రభుత్వం నుండి కలైమామణి ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్ తో సహా అనేక అవార్డులను గెల్చుకున్నారు, ఇక అతని వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే వినీత్ ఆగష్టు 2004 లో తలస్సేరికి చెందిన ప్రిస్కిల్లా మీనన్ ను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వినీత్ కుటుంబం చెన్నై లో నివసిస్తున్నారు మరియు 2006 లో వారికీ ఒక కుమార్తె జన్మించింది. వినీత్ కి చిన్నతనం లో నటన అంటే ఇష్టం ఉండేది కాదు సినిమాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం ఉండేది దీనితో తన పిన్ని అయినా పద్మిని సినిమాలకి సంబంధించి అనేక ప్రశ్నలు అడిగేవాడు దీనితో ఇంట్లోనే భరతనాట్యం చేసి చూపెట్టేవారు నాట్యం లోనే కాకుండా సినిమాలో నటించేందుకు వ్యక్తీకరణలు నేర్చుకున్నాడు. వినీత్ తన 10th పూర్తయ్యాక కళామండలం సరస్వతి టీచర్ తో సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఆమె భర్త ఎం.టీ. వాసుదేవన్ నైర్ సినిమా డైరెక్టర్ కావడం తో ఛాన్స్ ఇచ్చాడు.

‘ నఖక్షతంగల్’ సినిమాలో మొదట నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా రచయత ఎం.టీ. వాసుదేవన్ హరి హారన్ డైరెక్ట్ చేసారు. వినీత్ కి తొలి సినిమా అయినప్పటికీ మంచి పేరు దక్కించుకున్నాడు, నఖక్షతంగల్ సినిమా 1985లో విడుదలై హిట్ అయ్యింది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మోనిష కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ ఫిలిం అవార్డు దక్కింది, ఈ సినిమా తమిళ్ లో రీమేక్ అయింది, తొలి రెండు సినిమాలు హిట్ కావడం తో పాటు వినీత్ నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు వరస ఆఫర్లు బాగా వచ్చాయి. మలయాళం, తమిళ్ సినిమాలో పెద్ద యాక్టర్స్ తో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వినీత్ సరిగమలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగు పెట్టాడు. ఆ తరువాత ఆరో ప్రాణం, రుక్మిణి, మా అన్నయ,అమ్మాయి కోసం, నీ ప్రేమకై వంటి పెద్ద సినిమాలో నటించి తెలుగు ఇండస్ట్రీ లో కూడా మంచి ఫేమ్ దక్కించుకున్నాడు.

ప్రేమ దేశం సినిమాతో వినీత్ కి ఫాలోయింగ్ బాగా పెరిగింది అప్పట్లో వినీత్ ని లవర్ బాయ్ గా పిలిచేవాడు, హీరో గా యాక్టింగ్ మాత్రమే కాకుండా డబ్బింగ్ కూడా చెప్పేవారు, లూసిఫెర్, బిగ్ బ్రదర్, కండువా, మరక్కర్ అరబికడలింటే సింహం,ఒట్టు వంటి సినిమాకు డబ్బింగ్ చెప్పాడు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కేరళ స్టేట్ ఫిలిం అవార్డు గెలుచుకున్నాడు, ఇక వినీత్ మల్టీ టాలెంటెడ్ అనే చెప్పచు తనకి డాన్స్ తో పాటు నటన, డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి కొరియోగ్రాఫర్ అనే చెప్పచు, వినీత్ ఇంకా 2005 సంవత్సరం తరువాత సినిమాలకు దూరం అయ్యారు, 2021లో కీర్తి సురేష్, నితిన్ నటించిన రంగడే సినిమాతో మల్లి తెరమీదకు కనిపించాడు. వినీత్ కుటుంబ విషయాలు గురించి బయట ఎవరికీ పెద్దగా తెలీదు అనే చెప్పాలి, ఇక వినీత్ భార్య తన కూతురు ఫొటోస్ ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, వినీత్ మల్లి సినిమాలో కనిపిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Tags :
500 views