అబ్బాయిల్లో అది ఉంటే చాలు పెళ్లి చేసేసుకుంటా అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చిన ‘ఎనిమల్’ బ్యూటీ!

Posted by venditeravaartha, February 1, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

త్రిప్తి డిమ్రి ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న పేరు ‘యానిమల్’ సినిమాతో ఒక క్రేజీ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్. ఈ సినిమా తరువాత సోషల్ మీడియా లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది, త్రిప్తి డిమ్రి 23 ఫిబ్రవరి 1994లో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్హ్వాల్ లో మీనాక్షి మరియు దినేష్లకు హిందూ కుటుంబం లో జన్మించింది, త్రిప్తి కి అశుతోష్ అనే సోదరుడు ఇండియన్ ఎయిర్లైన్స్ లో పని చేస్తారు, కృతిక అనే సోదరి ఉన్నారు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీ లో ఉద్యోగం చేస్తుంది, త్రిప్తి ఫిరోజాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంది, శ్రీ అరబిందో కాలేజీ నుండి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. మొదటి నుండి సినిమాల మీద ఇష్టంతో త్రిప్తి పూణే లోని ఫిలిం అండ్ టెలివిషన్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియాలో యాక్టింగ్ కొనసాగించింది. 2017 లో పోస్టర్ బాయ్స్ సినిమాతో బాలీవుడ్ లోకి తన కెరీర్ మొదలు పెట్టింది.

ఆ తరువాత రొమాంటిక్ డ్రామా లైలా మజ్నులో ఆమె మొదట ప్రధాన పాత్రను పోషించింది. అన్వితా దత్ పిరియాడికల్ ఫిల్మ్ బుల్బుల్ మరియు ఖలా సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డ్స్ గెలుచుకుంది.త్రిప్తి ఎన్నో సినిమాలో నటించినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ ‘యానిమల్’ సినిమాలో రన్బీర్ తో కలిసి బోల్డ్ రోల్ లో నటించిన ఆమెకు చాలా తక్కువ సమయం లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ దక్కింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు కి నామినేషన్ లో నిలిచింది. 2022 లో త్రిప్తి అన్విత దత్ తో కలిసి నటించిన ఖలా సినిమాకి కూడా మంచి పేరు ప్రశంశలు లభించాయి. ఈ సినిమాలో త్రిప్తి టైటిల్ రోల్ ని పోషించారు అంటే కాకుండా ఈ సినిమాలో త్రిప్తి పడిన పాట అందరిని అక్కటుకుంది మ్యూజికల్ ఈవెంట్స్ లో సైతం పాపులర్ సింగెర్స్ తో కలిసి పాటలు పడుతూ ఉంటారు త్రిప్తి. యానిమల్ సినిమాలో జోయా పాత్రతో ఆమె కెరీర్ కి మంచి పేరు దక్కింది అనే చెప్పాలి.

అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రాన్ని రూపొందించాడు, విడుదలకి ముందే హైప్ సృష్టించిన యానిమల్ చిత్రం ఊహించినట్టుగానే ఘానా విజయాన్ని సాధించింది, హీరో రన్బీర్ కపూర్ భార్య గా రష్మిక నటించినప్పటికీ జోయా పాత్రలో నటించిన త్రిప్తి కి మంచి పేరు ఫాలోయింగ్ దక్కింది, ఈ సినిమాలో నటించినందుకు ఆమె 40 లక్షల రూపాయలు రెమ్యూనిరేషన్ తీసుకున్నారు అని తెలుస్తుంది. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో రన్బీర్ కపూర్ ,త్రిప్తి కి సంబందించిన ఒక వీడియో బయటకి వచ్చి విమర్శలకు దారి తీసింది అంటే కాకుండా ఫేమస్ హీరోయిన్ అనుష్కా శర్మ సోదరుడు కర్నేష్ శర్మ త్రిప్తి కి బాయ్ ఫ్రెండ్ అనే ప్రచారాలు కూడా జరిగాయి అయితే నటన త్రిప్తి కి వారసత్వం గా వచ్చిందనే చెప్పచు, తనకి ముందు నుండి ఫ్యాషన్ ప్రపంచం అంటే చాలా ఇష్టం.

త్రిప్తి మొదటిగా ముంబై లో మోడలింగ్ చేసి కమర్షియల్ యాడ్స్ లో చేసేది, శ్రీదేవి గారు నటించిన “మామ్” సినిమాలో త్రిప్తి చిన్న క్యారెక్టర్ లో నటించి తన కెరీర్ మొదలు పెట్టింది, ఆ తరువాత లైలా మజ్ను సినిమాతో తన అందం నటనతో మంచి పేరు తెచ్చుకుంది. అప్పటివరకు చిన్న చిన్న సినిమాలో చేస్తూ వచ్చింది. బల్బుల్ సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆమె అమాయకంగా కనపడే అమ్మాయి గా చాలా బాగా నటించింది. ఈ సినిమాకి 2020 లో ఫిలింఫేర్ ఓటిటి అవార్డు లో వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ లో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది ఇక త్రిప్తి కి ఇంస్టాగ్రామ్ లో 3 మిలియన్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు, ఆమెకు యాక్టింగ్, సింగింగ్ పై మంచి పట్టు ఉంది అందుకే విశేషమైన ప్రేక్షకుల అదరణలు పొందుతుంది, ఇప్పటివరకు ఆమె పోషించిన పాత్రలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది.

ఖలా సినిమా 2021లో నెట్‌ఫ్లిక్స్ ఓటిటి లో విడుదలైంది, బుల్బుల్ సినిమాలో ఘోడే పె సవార్ సాంగ్ సోషల్ మీడియా లో సెన్సషనల్ సృష్టించింది. ఈ సినిమాని చుసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ త్రిప్తి కి యానిమల్ సినిమాలో జోయా అనే క్యారెక్టర్ ఇచ్చారు, ఈ సినిమాలో త్రిప్తి పాత్ర తక్కువ సమయమే అయినప్పటికీ తన అందం, నటనతో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించి అందరిని అక్కటుకుంది, ప్రస్తుతం త్రిప్తి బాలీవుడ్ లో ఆనంద్ తివారి డైరెక్షన్ లో విక్కీ కౌశల్ తో జోడిగా ” మేరే మెహబూబ్ మేరే సనమ్” సినిమాలో నటిస్తుంది,ఈ సంవత్సరం లో ఈ సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా షూటింగ్ కి సంబందించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి, ఆ సినిమాతో పాటు విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలో కూడా నటిస్తుంది. బాలీవుడ్ లో మాత్రమే కాదు ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా త్రిప్తి కి వరస అవకాశాలు వస్తున్నట్టు సమాచారం.

Tags :
407 views