Kabir Duhan Singh: ఈ విలన్ భార్య ని ఎప్పుడైనా చూసారా..? ఈమె కూడా ఒక పెద్ద హీరోయిన్!

Posted by venditeravaartha, November 17, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Kabir Duhan Singh: గోపీచంద్ హీరోగా వచ్చిన స్టైలిష్ మూవీ ‘జిల్’తో విలన్ గా పరిచయమైన హిందీ నటుడు కబీర్ దుహన్ సింగ్ జూన్ 21న ఓ ఇంటి వాడయ్యాడు. ఆయన సీమా చాహల్‌ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. వీరి వివాహ వేడుక ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. కొత్త జంట కబీర్, సీమాల అందమైన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కబీర్ దుహన్ సింగ్ స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్. సీమా చాహల్ కూడా హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఆమె ఓ మ్యాథ్స్ టీచర్. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. కబీర్ దుహన్ సింగ్ తనను, అతని కుటుంబాన్ని అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతేకాదు సినిమా పరిశ్రమకు బయట అమ్మాయిని చేయాలని అనుకున్నారు. తనకు భార్యగా మంచి అమ్మాయి వచ్చిందని, దీంతో కబీర్ చాలా సంతోషంగా ఉన్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

కబీర్ తన నట ప్రయాణాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ప్రారంభించాడు. 2015లో యూవీ క్రియేషన్స్‌ నిర్మించిన ‘జిల్‌’ సినిమాలో విలన్‌గా నటించాడు. ఇక అజిత్ హీరోగా ‘వేదాళం’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తెలుగులో ‘కిక్ 2’, ‘డిక్టేటర్’, ‘స్పీడున్నోడు’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘సుప్రీమ్’, ‘జక్కన్న’, ‘పటేల్ సర్’, ‘సాక్ష్యం’, ‘వేట’ వంటి సినిమాల్లో నటించాడు. కబీర్ తెలుగులో చివరిగా ‘శాకుంతలం’లో కనిపించాడు. అలాగే ఉపేంద్ర హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘కబ్జా’లో కబీర్ నటించాడు. అతను చివరిగా మరాఠీ చిత్రం ‘ఫకత్’లో కనిపించాడు. కబీర్ దుహన్ సింగ్ కొన్ని సినిమాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే కబీర్ సింగ్ భార్య చాలా అందంగా ఉంటుంది. ఆమె అందం ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. ఆమె పేరుకు మ్యాథ్స్ టీచర్ అయినప్పటికీ తనకు బెంగాలీ భాషలో హీరోయిన్ గా చాలా అవకాశాలు వచ్చాయి. డైరెక్టర్లు తమ సినిమాల్లో నటించమని ఇంటికి వెళ్లి మరీ ఆఫర్లు ఇచ్చారట. కానీ ఆమె కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో తాను సినిమాల్లో చేయలేనని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. సీమ చాహల్‌, కబీర్ పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కబీర్ 2001 మోడలింగ్ ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

3622 views