Polimera2:ఇది మామూలు వసూళ్ల సునామి కాదు..మొదటి వారం ‘పొలిమేర 2’ ఎంత వసూళ్లను రాబట్టిందో తెలుసా?

Posted by venditeravaartha, November 10, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Polimera2: రెండేళ్ల క్రితం వచ్చిన ‘మ ఊరి పొలిమేర’ సినిమా నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రం అత్యధిక వ్యూయర్‌షిప్‌ను నమోదు చేసి టాప్ 10 సినిమాల్లో చోటు దక్కించుకుంది. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని గౌరీకృష్ణ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రాగా.. రెండో భాగం మాత్రం థియేటర్లలో విడుదలైంది. గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రం వంశీ నందిపతి, బన్నీ వాస్ సహకారంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

టీజర్, ట్రైలర్స్ కూడా అందరిలో క్యూరియాసిటీ క్రియేట్ చేశాయి. ఈ చిత్రానికి తొలిరోజు పాజిటివ్ టాక్ వచ్చింది. దసరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాస్త నెమ్మదించడంతో రీసెంట్ గా విడుదలైన చిన్న సినిమాలు అదరగొడుతున్నాయి. అందులో భాగంగా గత వారం విడుదలైన మా ఊరి పొలిమేర 2 సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది. మౌత్ టాక్ బాగుండడంతో ఈసినిమా ఆరు రోజుల్లో 14.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. ఇందులో షేర్ 7కోట్ల రూపాయలకు పైనే. కేవలం 4కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగడంతో ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేసుకొని బయ్యర్లకు భారీ లాభాలను అందిస్తోంది. ఫుల్ రన్ లో ఈసినిమా 20కోట్ల గ్రాస్ ను చేరుకొనే అవకాశం ఉందని బాక్సాఫీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒక్కసారి 7 రోజుల కలెక్షన్స్ చూస్తే..
నైజాం 3.30 కోట్లు
సీడెడ్ 0.65 కోట్లు
ఆంధ్ర (మొత్తం) 2.30 కోట్లు
ఏపీ + తెలంగాణ (మొత్తం) 6.25 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.80 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా (మొత్తం) 7.05 కోట్లు

‘మా ఊరి పొలిమేర 2’ సినిమాను చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేట్రికల్ మొత్తంగా రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఇక 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.7.05 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.3.55 కోట్ల లాభాలను అందించింది. ఆల్రెడీ క్లీన్ హిట్ గా నిలిచిన ఈ సినిమా రాబోయే రోజుల్లో నిర్మాతలకు ఎన్ని కోట్ల లాభాలను తెచ్చి పెడుతుందో చూడాలి. ఇక పొలిమేర 2 కూడా హిట్ కావడంతో పొలిమేర 3కూడా రానుంది.

1203 views