Jayasudha:చెప్పుల కోసం కొట్టుకున్న లెజండరీ హీరోయిన్స్..ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు!

Posted by venditeravaartha, November 8, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

Jayasudha : సినిమా రంగంలో హీరోహీరోయిన్ల మధ్య గొడవలు, ఇగోలు ఇలాంటివి అన్నీ సర్వసాధారణం. ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారంటే వారిద్దరి క్యారెక్టర్ లను బ్యాలెన్స్‌ చేయడం డైరెక్టర్ కు కత్తిమీద సాములాంటిదే. అదే ఒక సినిమాలో ఒకే రేంజ్ ఉన్న స్టార్ హీరోయిన్లు ఇద్దరు నటిస్తున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలా ఇద్దరు స్టార్ హీరోలు లేదా.. హీరోయిన్లు ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు అప్పట్లో దేవత సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జయప్రద, శ్రీదేవి మధ్య మాటలు లేవు.. అలాంటి వారిద్దరినీ కలపి సినిమా తీయడం రాఘవేంద్రరావుకి పెద్ద సవాల్ గా మారింది. అయితే ఆయన సీనియర్ దర్శకుడు కావడంతో ఇద్దరు షూటింగ్ సెట్లో మాట్లాడుకోకపోయినా ఎలాగోలా బ్యాలెన్స్ చేస్తూ ఆ సినిమాను తెరకెక్కించారు. శ్రీదేవి సెట్లోకి వస్తే జయప్రద పక్కకు వెళ్లిపోయేవారని టాక్.. అలాగే జయప్రద సెట్లోకి వస్తే శ్రీదేవి అక్కడ నుంచి మాయం అయ్యే వారట. ఇంత పెద్ద వార్ నడిచింది వారి మధ్య.

అలాగే కృష్ణంరాజు హీరోగా వచ్చిన కటకటాల రుద్రయ్య సినిమా షూటింగ్ సమయంలో అప్పటి స్టార్ హీరోయిన్లు జయసుధ, జయచిత్ర మధ్య కూడా పెద్ద వార్ నడిచిందట. ఈ సినిమాకు దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడు. రాజేంద్రప్రసాద్.. జయసుధ కోసం మంచి మంచి కాస్ట్యూమ్స్ తో పాటు స్లిప్పర్లు మంచి అలంకరణ సామగ్రి తెప్పించుకున్నారట. ఆ సినిమాలో ఆమెతో నటిస్తున్న జ‌యచిత్రకు మాత్రం మామూలు కాస్ట్యూమ్స్ ఇచ్చారట. ఇది జ‌య‌చిత్రకు బాగా కోపం తెప్పించింది. ఇదే అదునుగా జయచిత్ర… దాసరికి సార్ కావాలనే రాజేంద్రప్రసాద్ ఆమెపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు ఎందుకు ? ఇలా తక్కువ రకం కాస్ట్యూమ్స్ ఇచ్చారు నేరుగానే ప్రశ్నించడంతో జయసుధకు పట్టరాని కోపం వచ్చిందట.

ఆ తర్వాత జయచిత్ర, జయసుధ ఇద్దరు షూటింగ్లోనే ఒకరిపై ఒకరు మాటలు విసురుకున్నారు. జయసుధ హై హీల్స్ వేసుకునేదట.. అది జయచిత్రకు నచ్చకపోయేదట. చివరకు ఈ విషయంలో దర్శకుడు దాసరి జోక్యం చేసుకొని గొడవను పరిష్కరించారట. అయితే ఆ తర్వాత కూడా వారిద్దరూ ఆ సంఘటన మనసులో పెట్టుకుని పెద్దగా మాట్లాడుకోవడం మానేశారని టాక్.

Tags :
716 views