Varun – Lavanya: పెళ్లి రోజే విడాకుల అగ్రిమెంట్..వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్ళిలో భారీ ట్విస్ట్!

Posted by RR writings, November 3, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]


Varun – Lavanya: అసలే సినీ పరిశ్రమలోని హీరోహీరోయిన్లు ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటారు. అలా చేసుకున్నారో లేదో వెంటనే విడాకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అదేంటో అర్థం కాదు. కొంతకాలంగా ప్రేమలో ఉన్నవారు పెళ్లయ్యాక వారు ఏం ఆలోచిస్తారో తెలీదు విడాకులు తీసుకుంటున్నారు. ఈ విషయంలో సమంత, నాగ చైతన్య హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. వీరిని చూసి కొందరు సెలబ్రిటీలు కూడా విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు.

అయితే పెళ్లి చేసుకుంటే ఇలాంటివి కచ్చితంగా జరుగుతాయని పెళ్లికి ముందు వారు కండిషన్స్ పెట్టుకుంటారట కొందరు. ఇది సినిమా, బడా ఫ్యామిలీలలో జరుగుతూనే ఉంటుందట. రీసెంట్ గా లావణ్య, వరుణ్ కూడా పెళ్లికి ముందే విడాకుల విషయంలో కొన్ని షరతులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్న లావణ్య, వరుణ్‌లు ఇటీవల కుటుంబసభ్యుల సమక్షంలో ఎట్టకేలకు ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సమయంలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది.

అయితే నిశ్చితార్థానికి ముందే ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కొన్ని షరతులు కూడా పెట్టినట్లు తెలిసింది. వాటి మేరకే ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు విషయం లీక్ అయిందని తెలిసింది. ఇక ఇంట్లో చెప్పిన తర్వాత కుటుంబ సభ్యులు ఇప్పుడు జరుగుతున్న జంటల మధ్య వ్యవహారాల గురించి ఆలోచించి… ఒక వేళ మున్ముందు వీరి మధ్య కూడా ఏదైనా మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకోవాలి అనుకుంటే. ఇద్దరికీ సంబంధించిన ఆస్తులలో ఎవరికి హక్కు ఉండకుండా అగ్రిమెంట్ పై సైన్ చేయించుకున్నారట. అంటే లావణ్య ఆస్తులపై వరుణ్‌కి, వరుణ్ ఆస్తులపై లావణ్యకు ఎలాంటి అధికారం లేదని సంతకాలు చేయించుకుందట మెగా ఫ్యామిలీ. కలిసి ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులపైనే వారికి పూర్తి హక్కులు ఉంటాయని అగ్రిమెంట్ రాసుకుంది. ఈ విషయం ఇప్పుడు వైరల్‌గా మారడంతో పెళ్లికి ముందే విడాకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు. మీ కండిషన్స్ ఏంటి. ఇదేం కర్మ రా బాబు. సంతోషంగా పెళ్లి చేసుకుని అప్పుడే విడాకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

1326 views