Skanda : ఆశ్చర్యపరుస్తున్న ‘స్కంద’ 4 రోజుల వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఇదేమి రచ్చ!

Posted by venditeravaartha, October 2, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఈ ఏడాది ఎందుకు పెద్ద సినిమా పొరపాటున కూడా హిట్ అవ్వడం లేదు. విడుదలైన ప్రతీ క్రేజీ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద పల్టీలు కొడుతున్నాయి. చిన్న సినిమాలే ఈ ఏడాది మన టాలీవుడ్ కి శ్రీ రామ రక్ష లాగ నిలిచాయి. లేకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి ఘోరమైన సంక్షోభం లో పడేది/ స్టార్ హీరోలైన చిరంజీవి ‘భోళా శంకర్’, పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయాలు అందుకోలేదు, బయ్యర్స్ కి భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. ఈ సినిమాలు మాత్రమే కాకుండా భారీ బడ్జెట్స్ తో తెరకెక్కిన ‘ఏజెంట్’ , ‘శాకుంతలం’, ‘ఖుషి’ మరియు ‘కస్టడీ’ వంటి చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన ‘స్కంద’ (skanda)చిత్రం కూడా భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

‘అఖండ’ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం లో రామ్ హీరో గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై, ఆ అంచనాలను అందుకోవడం లో విఫలం అయ్యింది. కానీ క్రేజీ కాంబినేషన్ పవర్ తో లాంగ్ వీకెండ్ అద్భుతమైన ఓపెనింగ్స్ ని దక్కించుకుంది ఈ చిత్రం. రామ్ గత చిత్రం ‘వారియర్’ క్లోసింగ్ కలెక్షన్స్ దాదాపుగా 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు. కానీ ‘స్కంద’ చిత్రం ఆ వసూళ్లను కేవలం నాలుగు రోజుల్లోనే దాటేసింది. కేవలం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి ఈ సినిమా నాలుగు రోజుల్లో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి నాలుగు రోజుల్లో 23 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ అని చెప్పొచ్చు.

నాల్గవ రోజు అనగా ఆదివారం రోజు ఈ సినిమాకి రెండవ రోజు మరియు మూడవ రోజుకంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 47 కోట్ల రూపాయలకు జరిగింది. బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకొని సూపర్ హిట్ రేంజ్ కి వెళ్లాలంటే ఇంకా ఈ సినిమా 24 కోట్ల రూపాయిలు రాబట్టాల్సి ఉంటుంది. నేడు కూడా సెలవు దినం అవ్వడం తో ఈరోజు కూడా ఈ చిత్రానికి మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు వస్తాయట. ఇక టాక్ లేకపోవడం తో రేపటి నుండి ఈ సినిమాకి వసూళ్లు రావడం కష్టమే అని, ఫుల్ రన్ లో కచ్చితంగా 20 కోట్లు నష్టం ఉంటుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

350 views