ఆమె చెప్పిన మాటలు నమ్మి సమంత తో విడిపోవాల్సి వచ్చింది అంటూ నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Posted by venditeravaartha, September 18, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. తను నటించిన ఫస్ట్ సినిమాతోనే కుర్రాళ్ల కలల రాణిగా మారిపోయింది. తర్వాత బడా హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కొన్నేళ్ల పాటు కంటిన్యూగా కెరీర్ కొనసాగించిన వారి జాబితాలో సమంత ఒకరు. తను తాజాగా నటించిన ఖుషి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో కొన్నాళ్లుగా హిట్ కోసం ఎదురు చూస్తున్న సమంత, విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఖుషి సినిమా ప్రమోషన్ టైంలో హీరో విజయ్ దేవరకొండతో సమంత వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారి తీసింది.

చాలా మంది తన పై నెగిటివ్ కామెంట్లు చేశారు. అసలేం జరిగిందంటే.. ప్రమోషన్ టైంలో విజయ్ దేవరకొండ షర్టు విప్పేసి సమంతనీ గాల్లోకి లేపి డ్యాన్స్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెకు అర్ధరాత్రి వీడియో కాల్ చేసి రచ్చ రచ్చ చేశారు. ఈ విషయాలన్నీ గమనించిన అక్కినేని ఫ్యాన్స్ సమంత తీరుపై గుస్స అయ్యారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా నెగిటివ్ కామెంట్లు.. నాగచైతన్య ఫ్యాన్స్ సైడ్ నుంచి రావడం సంచలనంగా మారింది. అసలు తన మాజీ భార్య సమంతకు ఎందుకు డివోర్స్ ఇవ్వాల్సి వచ్చిందో తన కస్టడీ సినిమా ప్రమోషన్లో నాగ చైతన్య చెప్పుకొచ్చారు.

ఆ సినిమా టైంలో హీరో నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సమంతతో విడాకుల ప్రస్తావన వచ్చి ఆ సందర్భంలో మాట్లాడారు… మేము విడిపోయి రెండేళ్లు అయ్యింది. అధికారికంగా డివోర్స్ తీసుకుని సంవత్సరం అయింది. విడాకుల తర్వాత ఎవరి జీవితాలు వారు వేర్వేరుగా హాయిగా బతుకుతున్నాము. చట్టపరంగా ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నన్ని రోజులను చాలా గౌరవంగానే భావిస్తాను. నిజానికి సమంత చాలా లవ్లీ ఉమెన్. ఆమె జీవితంలో అనుభవించాలకున్న అన్ని ఆనందాలకు అర్హురాలు. నిజానికి మీడియా ఊహాగానాల కారణంగానే మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి చినికి చినికి పెద్దవయ్యాయి. ఆఖరికి ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. నేను మొదట్లో సమంత గురించి వచ్చిన ఊహాగానాల గురించి పట్టించుకోలేదు. కానీ, తర్వాత పరిస్థితులు మారాయి. సమంతతో విడిపోయిన తర్వాత జనాలు ప్రస్తుతం నా పెళ్లి గురించి రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం అలాంటి ఉద్దేశం లేదు. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. గతం గత:.. ఇక మీదట ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను” అని చెప్పుకొచ్చారు. కానీ ఆ సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో మూడో వ్యక్తి గురించి మాట్లాడటం వల్లే.. సామ్ తో విడిపోవాల్సి వచ్చిందని నాగచైతన్య స్పష్టం చేశారు. ఆ మూడో వ్యక్తి ఎవరని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు.

Tags :
262 views