Baby: బేబీ సినిమా ని అందుకే రిజెక్ట్ చేశాను:విశ్వక్ సేన్

Posted by venditeravaartha, July 27, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరో ల లో విశ్వక్ సేన్ గారికి ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిన విషయమే,మొదట 2017 లో రిలీజ్ అయినా వెళ్ళిపోమాకే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ తన రెండవ సినిమా ఈ నగరానికి ఏమైంది సినిమా తో సూపర్ హిట్ ని అందుకోవడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇక తానే స్వయంగా డైరెక్ట్ చేసి నటించిన ఫలకనామ దాస్ తో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు.ఈ సినిమా తో టాలీవుడ్ యంగ్ హీరో ల లో ఒకరు గా ఎదిగారు హిట్ సినిమా లో ఇంటెన్స్ పోలీస్ క్యారెక్టర్ లో కనిపించిన విశ్వక్ సేన్ ఆ తరువాత పూర్తి స్థాయి ప్రేమ కథ చిత్ర ల లో నటించి అటు యువత ,ఫ్యామిలీ ప్రేక్షకుల కి దగ్గర అయ్యారు.

viswak sen

ఓరి దేవుడా సినిమా  తర్వాత యాక్షన్ హీరో అర్జున్ గారితో ఒక సినిమా ని ఒప్పుకుని షూటింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా నుంచి తప్పుకుని అప్పట్లో వార్తల లో నిలిచారు.తనకి షెడ్యూల్ సరిగా సెట్ కాకపోవడం వలన ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది తప్ప మరొక కారణం ఏమి లేదు అని విశ్వక్ సేన్ క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా నుంచి బయట వచ్చాక తానే నిర్మాతగా ,డైరెక్టర్ గా ధమ్కీ సినిమా ని చేసి బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే, ఇక ప్రస్తుతం మరొక సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం నెట్టింట హల్చల్ చేస్తుంది.చిన్న సినిమా గా మొదలైన సినిమా ఇప్పుడు పెద్ద బ్లాక్ బస్టర్ గా అయినా బేబీ సినిమా ని తాను రిజెక్ట్ చేసిన విషయం ని డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ సక్సెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే.

dhas ka dhamki

బేబీ సక్సెస్ మీట్ లో సాయి రాజేష్ మాట్లాడుతూ బేబీ సినిమా ని తాను హై రేంజ్ లో చేయాలి అనుకుని మొదట విశ్వక్ సేన్ ని అడిగితే కనీసం నన్ను కలవడానికి కూడా ఇష్టం లేకుండా సినిమా ని రిజెక్ట్ చేశారు అని అయితే అది మనసు లో పెట్టుకునే ఈ రేంజ్ లో సినిమా ని చేశాను అని అన్నారు.ఇక సాయి రాజేష్ కి కౌంటర్ గా విశ్వక్ సేన్ మాట్లాడుతూ బేబీ సినిమా కథ నాకు నచ్చలేదు అని నేను ఎక్కడ చెప్పలేదు,ఆ సమయం లో నాకు అలాంటి సినిమా చేయాలి అని లేదు,అలాంటప్పుడు నేను వారిని కలిసి కథ విని చివరి లో సినిమా ని రిజెక్ట్ చేయడం కంటే మొదట నే రిజెక్ట్ చేయడం ఇద్దరికీ మంది అనే ఉద్దేశం తోనే చేశాను తప్ప మరొక కారణం లేదు అని అన్నారు.

viswak and sai rajesh

1029 views