Suma: స్టార్ హీరోయిన్ ల ని మించిపోయిన సుమ రెమ్యూనిరేషన్ ! ఎపిసోడ్ కి అంత తీసుకుంటుందా ?

Posted by venditeravaartha, June 1, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సుమ(Suma) ఈ పేరు తెలియని తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు,బుల్లి తెర మీద తనకంటూ ప్రత్యేకమైన స్థానం ని ఏర్పచుకున్న సుమ కొన్ని సినిమా లలో నటించింది,సినిమా ల లో ఛాన్స్ లు వచ్చినప్పటికీ బుల్లి తెర ని వదలకుండా టీవీ షో ల ని చేస్తూ మరో పక్క ప్రీ రిలీజ్ ఈవెంట్, సినిమా ప్రొమోషన్ ల ఇంటర్వ్యూ ల ను చేస్తూ సుమ బిజీ బిజీ గా ఉంటారు.ఈటీవీ లో సీరియల్ చేసే సమయం లో రాజీవ్ కనకాల(Rajiv kanakala) తో ప్రేమ లో పడిన సుమ 1999 లో పెళ్లి చేసుకున్నారు.రాజీవ్ కనకాల తన సినిమా ల తో ఒక పక్క బిజీ గా ఉంటె సుమ మరో పక్క టీవీ షో లు ,ఇంటర్వ్యూ లు చేస్తూ బోలెడు డబ్బులు సంపాదిస్తున్నారు.

suma rajiv

ప్రస్తుతం ఉన్న యాంకర్ ల లో మొదటి స్థానం లో ఉంటారు సుమ,ఆమె చేసే ప్రతి ఈవెంట్ కి 5 లక్షల రూపాయలు తీసుకుంటారు.అలానే టీవీ షో ల లో ఒక ఎపిసోడ్ కి 2 నుంచి 3 లక్షల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.ఈ లెక్కన ఆమె చేస్తున్న షో లు ,ఈవెంట్ ల ద్వారా నెల కి దాదాపు గా 40 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు.ఇలా సంవత్సరానికి 5 కోట్ల పైన సుమ గారు సంపాదిస్తున్నారు.

suma

ఈటీవీ లో వచ్చే క్యాష్,జీన్స్ షో ల కి అంత పాపులారిటీ వచ్చింది అంటే దానికి కారణం సుమ
అంతకు ముందు ఈటీవీ లో వచ్చిన స్టార్ మహిళా షో కి కూడా విపరీతమైన ఆదరణ వచ్చింది
ఇలా షో లు ,ఈవెంట్ ల తో లక్షలు సంపాదిస్తున్న సుమ,స్టార్ హీరోయిన్ లకి మించిన రెమ్యూనిరేషన్ తో దూసుకునిపోతున్నారు.అయితే ఇది వరకు కొన్ని టీవీ ఛానెళ్ల లో సుమ కి రాజీవ్ కనకాల కి మధ్య ఈ ఆర్ధిక విభేదాల కారణంగా గొడవలు వచ్చాయి అని కూడా వార్తలు వచ్చాయి.అయితే వీటిని వీరు ఇద్దరు ఖండించారు.సుమ కి ఫ్రీడమ్ ఉంది అని ఆమె సంపాదన ఆమె ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే హక్కు ఆమెకి ఉంది అని ఇది వరకే రాజీవ్ చాల సార్లు చెప్పారు.

suma at shows

1383 views