Rajamouli: అందుకే విలన్ ల ని హీరో కంటే స్ట్రాంగ్ చూపిస్తాను:రాజమౌళి

Posted by venditeravaartha, May 31, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

దర్శక ధీరుడు అపజయం ఎరుగని డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) తాను ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన సినిమా ల లో ఒక్కటికూడా ప్లాప్ లేదు.తన 22 సంవత్సరాల సినీ కెరీర్ లో 4 ఇండస్ట్రీ హిట్ లు కలిగిన రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియన్ లెవెల్ నుంచి పాన్ వరల్డ్ స్థాయి కి వెళ్లారు. అయితే తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఇటీవల రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్ వరకు రాజమౌళి సినిమా ల ను ఒక సారి పరిశీలిస్తే హీరో క్యారెక్టర్ ని ఎంతలా అయితే హైప్ లో డిజైన్ చేస్తాడో దానికి మించిన స్థాయి లో తన విలన్ క్యారెక్టర్ ని డెవలప్ చేస్తాడు.తాను సెలెక్ట్ చేసుకునే విలన్ లు కూడా మంచి కట్ అవుట్ ని కలిగి ఉంటారు.

VILLAN

తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 లో కాలేజీ నేపథ్యంలో చేసినప్పటికీ ఎన్టీఆర్ కి పోటీ గా రాజీవ్ కనకాల ని విలన్ గా చూపించారు.ఇక తన సింహాద్రి సినిమా లో ముకేశ్ రిషి ని ఎన్టీఆర్ ని మించి చూపించారు.నితిన్ తో చేసిన సై సినిమా లో అయితే హీరో కి 10 రేట్లు స్ట్రాంగ్ గా ఉండే ప్రదీప్ రావత్(Pradeep ravath) ని భిక్షు యాదవ్ గా చూపించి అందరిని భయపెట్టారు అని చెప్పాలి.ప్రభాస్ తో చేసిన ఛత్రపతి సినిమా లో కాట్రాజ్ గా సుప్రీత్(Supreeth) ని రాజ్ బిహారి గా ప్రదీప్ రావత్ ని చూపించారు.అప్పటి వరకు తన కమర్షియల్ సినిమా ల లో హీరో లకి మించి విలన్ ల ని ఎంపిక చేసుకున్న రాజమౌళి తన విక్రమార్కుడు సినిమా తో తానే విలన్ ల ని రెడీ చేసాడు అని చెప్పాలి.

EEGA

2006 లో రిలీజ్ అయినా విక్రమార్కుడు సినిమా తో అప్పటివరకు సైడ్ క్యారెక్టర్ లు చేస్తున్న అజయ్ ని మెయిన్ విలన్ గా చూపించారు రాజమౌళి.సెకండ్ హాఫ్ లో వచ్చే విక్రమ్ సింగ్ రాథోర్ కి పోటీగా తిట్ల క్యారెక్టర్ లో అజయ్(Ajay) మాములుగా చేయలేదు.ఇక మగధీర సినిమా తో రామ్ చరణ్ కి పోటీగా దేవ్ గిల్ ని ఎంపిక చేసి మగధీర లో దేవగిల్(Dev gil) చేత సూపర్బ్ యాక్టింగ్ తో మెప్పించారు.ఆ తర్వాత తాను చేసిన ఈగ ,మర్యాద రామన్న లాంటి సినిమా ల లో కూడా కిచ్చ సుదీప్(Sudeep) ,నాగినీడు(Nagineedu) వంటి పవర్ ఫుల్ విలన్ లని పెట్టారు.ప్రభాస్ ని బాహుబలి లాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ లో చూపించిన రాజమౌళి హీరో ని మించిన విలన్ కావాలి అని అప్పటివరకు హీరో గా చేసిన రానా(Rana) ని ఆ సినిమా లో భయంకరమైన విలన్ గా చూపించారు,ఇక బాహుబలి సిరీస్ లో ప్రభాస్ గారి కంటే కూడా రానా కె ఎక్కువ క్రెడిట్ వచ్చింది అంటే రాజమౌళి తన విలన్ ల కి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో అర్ధం అవుతుంది.

PRABHAS

ఇక ఇటీవల రిలీజ్ అయినా ఆర్ ఆర్ ఆర్(RRR) మూవీ లో కూడా హాలీవుడ్ హీరో ని విలన్ గా చూపించారు.ఇక రానున్న తన మహేష్ మూవీ లో కూడా ప్రముఖ హాలీవుడ్ హీరో ని మహేష్ కి విలన్ గా చూపించనున్నారు అని సమాచారం.ఇక ఇదే విషయాన్ని రాజమౌళి ని అడగక తన సినిమా లో హీరో స్ట్రాంగ్ కి ఉండాలి అంటే తాను పోటీ పడే విలన్ తన కంటే స్ట్రాంగ్ గా ఉంటె నే ఆ సినిమా లో హీరో కి అంత స్ట్రాంగ్ ఎలివేషన్ పడుతుంది అని నా సినిమా ల లో విలన్ క్యారెక్టర్ ల ని ఆలా డిజైన్ చేస్తాను అని చెప్పారు.

RRR

808 views