Harish shankar: అవును నేను అన్ని రీమేక్ సినిమా లే చేస్తా..అయితే ఏంటి !

Posted by venditeravaartha, May 28, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

హరీష్ శంకర్(Harish shankar) ఈ పేరు వినగానే అందరికి గుర్తు వచ్చేది ‘గబ్బర్ సింగ్’..10 సంవత్సరాలు హిట్లు లేకుండా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ గారికి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు.. హరీష్ శంకర్ మొదట గా స్క్రీన్ రైటర్ గా పూరీజగన్నాధ్,కోన వెంకట్,రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసారు.తన లోని టాలెంట్ ని చూసి రాంగోపాల్ వర్మ తనకి షాక్ సినిమా తో డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు.మొదటి సినిమా డిజాస్టర్ అయినప్పటికీ తన కి అవకాశం ఇచ్చిన రవితేజ తోనే తన రెండవ సినిమా ‘మిరపకాయ్’ చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు .మిరపకాయ్ లో తన డైరెక్షన్ నచ్చిన పవన్ కళ్యాణ్(Pawan kalyan) తన గబ్బర్ సింగ్ కోసం హరీష్ శంకర్ ని ఎంచుకున్నాడు.

harish shankar

2012 మే 11 న రిలీజ్ అయినా గబ్బర్ సింగ్(Gabbar singh) సినిమా తో పవన్ కళ్యాణ్ గారి 10 సంవత్సరాల నిరీక్షణ కి తెరపడింది.అప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న రికార్డు ల అన్నిటిని బ్రేక్ చేసి ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది.సల్మాన్ ఖాన్ గారి దబాంగ్ కి రీమేక్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారికోసం అందులో కొన్ని మార్పులు చేసారు హరీష్ శంకర్.. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,దువ్వాడ జగన్నాధం,గద్దలకొండ గణేష్ వంటి సినిమా ల ను తీసిన హరీష్ శంకర్ మరొకసారి తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్(Ustad bhagath singh) తో మరో సారి మన ముందుకు రానున్నారు.ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ అయినా తేరి కి రీమేక్ అని కొన్ని రూమర్స్ వస్తునప్పటికీ మూవీ టీం మాత్రం ఇంకా కంఫర్మ్ చేయలేదు.

Harish pawan

మలయాళ సినిమా 2018 ని తెలుగు లో రిలీజ్ చేస్తున్న సందర్భముగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం లో ఒక రిపోర్టర్ హరీష్ శంకర్ ని మీరు ఎందుకు తమిళ్ ,మలయాళ డైరెక్టర్ ల గా అలాంటి సినిమా ల ను తీయలేరు..మీరు కూడా అలాంటి కంటెంట్ ఉన్న సినిమా ల ను తీస్తే అక్కడ సినిమా ల ను మనం రీమేక్ కానీ డబ్బింగ్ గాని చేయాల్సిన అవసరం ఉండదు కదా అని అడిగిన ప్రశ్న కి హరీష్ శంకర్ సమాధానం ఇస్తూ  ప్రపంచం అంత తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్ ల ను చూస్తుంటే మన మీడియా మాత్రం మన వాళ్ళని తక్కువ చేస్తుంది.మీరు అన్నట్టు రీమేక్ లు తీస్తే జనాలు చూస్తారా అంటే ఇది వరకు రిలీజ్ చేసిన సినిమాలే ఉదాహరణ..            కంటెంట్ బాగుంటే ఇండియా లో ఉన్న అన్ని భాష ల లో రీమేక్ చేసిన సినిమా ని సక్సెస్ చేస్తారు అని చెప్పారు.

463 views