తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు శరత్ బాబు సోమవారం ఉదయం మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన మరణించినట్లు వార్తలు వచ్చాయి. కానీ సోమవారం మధ్యాహ్నం ఆయన కుటుంబ సభ్యులు మీడియాకు తెలపడంతో సినీ లోకం కన్నీళ్లు పెట్టుకుంది. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా నటించిన శరత్ బాబుకు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. రీజెంట్ ఆయన సీనియర్ నటుడు నరేశ్ తో కలిసి ‘మళ్లీ పెళ్లి’లో నటించారు. అయితే కొన్ని రోజులుగా ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం తీవ్ర అనారోగ్యంతో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. శరత్ బాబు మృతిపై కొందరు నెట్ ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొన్ని రోజల కిందటే శరత్ బాబు మరణించారని తెలియడంతో వెంటనే కమలాసన్ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
మే 5న శరత్ బాబు మృతి చెందినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. దీంతో కొందరు నివాళులర్పించారు కూడా. అయితే వెనకా ముందు చూడకుండా సౌత్ సినీ స్టార్ హీరో కమలాసన్ తన ట్విట్టర్ ఖాతాలో శరత్ బాబుకు నివాళులర్పిస్తున్నట్లు మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ వైరల్ కావడంతో కుటుంబ సభ్యుల స్పందించారు. శరత్ బాబు ఇంకా చనిపోలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు. దీంతో కమలాసన్ వెంటనే తేరుకొని ఆ మెసేజ్ ను డెలీట్ చేశారు. అయితే ఒక స్టార్ హీరో అయి ఉండి విషయం పూర్తిగా తెలుసుకోకుండా నివాళులర్పించడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక శరత్ బాబు, కమలాసన్ కలిసి సాగర సంగమమం, స్వాతిముత్యంలో నటించిన విషయం తెలిసిందే.
ఇక 1950 ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి శరత్ బాబు కుటుంబం ఏపీలోని అముదాలవలసకు తరలివచ్చింది. శరత్ బాబుకు ఏడుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెలు. శరత్ బాబు మూడో వారు. సత్యనారాయణ దీక్షితులుగా పిలవబడే శరత్ బాబును ఆయన కుటుంబ సభ్యులు సత్యంబాబు గా పిలుస్తారు. 1973లో ‘రామరాజ్యం’ అనే సినిమాతో హీరోగా పరిచయమైన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. శరత్ బాబు సినీ కెరీర్లో సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమకింకరుడు, అమరజీవి అనే సినిమాలు విజయవంతమయ్యాయి.1981, 1988, 1989 లల్లో మూడు సార్లు ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు.
మొదటిసారిగా సీతాకోక చిలుక, రెండోసారి ఓ భార్య కథ, మూడోసారి నీరాజనం అనే సినిమాలకు ఈ పురస్కారాలు అందాయి. ఆయన సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రమాప్రభ అనే నటిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత వీరువిడాకులు తీసుకున్నారు. మొత్తం 124 సినిమల్లో నటించిన శరత్ బాబు కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించారు. చిరంజీవి సినిమా అన్నయ్యలో శరత్ బాబు విలన్ పాత్ర పోషించారు. ప్రస్తుతం శరత్ బాబు ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 71 సంవత్సరాలు. శరత్ బాబు మృతి తెలియగానే సినీ లోకం దిగ్భ్రాంతికి లోనైంది.