Tollywood: సినిమా డిజాస్టర్ కావడం తో తమ రెమ్యూనిరేషన్ ఇచ్చేసిన ఆ హీరోలు ఎవరో తెలుసా !

Posted by venditeravaartha, May 15, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే 24 క్రాఫ్ట్స్ పని చేయాలి ,ఎవరి పని వాళ్ళు కరెక్ట్ చేసి సినిమా ని అనుకున్న విధంగా తీసి ప్రొడ్యూసర్ చేతి లో పెడితే అయన ఆ సినిమా ని రిలీజ్ చేస్తారు హిట్ అయితే ఆ సినిమా లో పని చేసిన హీరో ,హీరోయిన్ ,మిగితా యాక్టర్ ల కు మంచి పేరు తో పాటు మరికొన్ని అవకాశాలు వస్తాయి ,సినిమా ని ప్రొడ్యూస్ చేసిన నిర్మాత కి డబ్బులు వస్తాయి అదే సినిమా ప్లాప్ అయితే ఒక్క ప్రొడ్యూసర్ మినహా మిగతా వారు హ్యాపీ గానే ఉంటారు.ఇండస్ట్రీ లో చాల మంది పెద్ద వాళ్ళు అన్నట్లు సినిమా బతకాలి అంటే ప్రొడ్యూసర్ బాగుండాలి.మరి ఫుల్ కమర్షియల్ గా ఉండే సినీ ఇండస్ట్రీ లో సినిమా ప్లాప్ అయ్యి ప్రొడ్యూసర్ రోడ్ మీద పడినప్పుడు..మేము ఉన్నాము అని అయన కి సపోర్ట్ గా నిలిచి తమ రెమ్యూనిరేషన్ సైతం వెనక్కి ఇచ్చి నిర్మాత ని బతికించిన ఆ హీరో లు ఎవరో చూద్దాం!

రజినీకాంత్:సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ అంత ఇంత కాదు ,తమిళనాడు ఒక్కటే కాకుండా ఇండియా అంతటా ఆయనకి ఫాన్స్ ఉన్నారు.అయితే ఆయన కెరీర్ లో టాప్ లో ఉన్నపుడు భారీ బడ్జెట్ తో తీసిన ‘బాబా ‘ సినిమా ఊహించని ప్లాప్ అయింది .దాంతో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ రోడ్ న పడ్డారు,విషయం తెలుసుకున్న రజినీకాంత్ తన రెమ్యూనిరేషన్ మొత్తం వెనక్కి ఇచ్చి వారిని ఆదుకున్నారు.

పవన్ కళ్యాణ్ :రజినీకాంత్ గారికి ఉన్న విధంగా నే మన టాలీవుడ్ లో ఆ స్థాయి ఫ్యాన్ బేస్ కలిగి ఉన్న ఏకైక హీరో ‘పవన్ కళ్యాణ్’..అయన నటించిన జానీ ,కొమరం పులి,సర్దార్ గబ్బర్ సింగ్ , అజ్ఞాతవాసి సినిమా లు డిజాస్టర్ ల గా నిలిచి నిర్మాతలు భారీగా నష్టపోయారు.వారి నష్టాలను పూడ్చడానికి తన రెమ్యూనిరేషన్ ని రిటర్న్ చేసారు.

మహేష్ బాబు:సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బాబీ ,ఖలేజా సినిమా లు ప్లాప్ అయినప్పుడు అయన తీసుకున్న రెమ్యూనిరేషన్ ని వెనక్కి ఇచ్చి ప్రొడ్యూసర్స్ కి అండగా నిలిచారు.

రవి తేజ:ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన రవితేజ కి ఇండస్ట్రీ లో ఉన్న కష్టాలు అన్ని బాగా తెలుసు..అందుకే తాను నటించిన సినిమా ల ద్వారా నిర్మాతల కి నష్టాలు వస్తున్నాయి అని తెలిస్తే తన రెమ్యూనిరేషన్ లో చాల వరకు తగ్గించి తీసుకుంటారు అని టాక్.

రామ్ చరణ్:మగధీర సినిమా తర్వాత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయినా ఆరంజ్ సినిమా సూపర్ డిజాస్టర్ అయింది .దానితో ప్రొడ్యూసర్ నాగబాబు గారు చాల నష్టాలను చూసారు..ఇక రామ్ చరణ్ అయన తీసుకున్న రెమ్యూనిరేషన్ వెనక్కి ఇచ్చేసారు.

ఇక వీరు కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు తాను నటించిన సినిమా నష్టాలను చూస్తే తన రెమ్యూనిరేషన్ వెనక్కి ఇవ్వడమే కాకుండా.. ఆ ప్రొడ్యూసర్ తో మరో సినిమా తీసి ఆయనకి సక్సెస్ తో పాటు డబ్బులు వచ్చేలా చేసారు.అందుకే కృష్ణ గారిని నిర్మతల హీరో అంటారు.

436 views