Karate kalyani: సీనియర్ ఎన్టీఆర్ పెద్ద గొప్పేమి కాదు..ఆయనకీ విగ్రహం దండగ: నటి కరాటీ కళ్యాణి

Posted by venditeravaartha, May 13, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

సీనియర్ ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు గానే కాకుండా తెలుగు దేశం పార్టీ వ్యస్థాపకుడు గా , ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్య మంత్రి గా ,అన్నిటికి మించి తెలుగు వాళ్ళందిరి కి ఆరాధ్య దైవం గా అయ్యారు.ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకుని ఖమ్మం లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు,మొదట ఎవరు కూడా అభ్యంతరాలను తెలియాచేయలేదు కానీ మే 28 నా విగ్రహ ఆవిష్కరణ సమీపిస్తున్న వేళా ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ ఆపివేయాలని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! అందులో సినీ ఇండస్ట్రీ కి చెందిన నటి ‘కరాటీ కళ్యాణి'(Karate kalyani) కూడా ఉన్నారు.

శ్రీ కృష్ణుడు అవతారం లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఏంటి అంటూ హిందూ యాదవ సంఘాల కి చెందిన వారు మొదట దీన్ని వ్యతిరేకించారు.తాము ఎన్టీఆర్ గారికి కానీ అయన పార్టీ కి కానీ వ్యతిరేకులము కాదు..అయితే ఒక మానవుడు కి దేవుడి అవతారం లో ఉన్న విగ్రహాన్ని పెట్టడం సరి కాదు.ఇది కేవలం రాజకీయాల ప్రయోజనాల కోసం మాత్రమే చేస్తున్న పని తప్పితే ఎన్టీఆర్ గారి మీద అభిమానం గాని,ప్రేమ తో గాని చేస్తున్న పని అయితే కాదు.రాబోయే తరాల పిల్లలు సీనియర్ ఎన్టీఆర్ నే దేవుడు ,కృష్ణుడు అనుకునే ప్రమాదం ఉంది.సీనియర్ ఎన్టీఆర్ గారు ఏమి దేవుడు కాదు కదా ..అయన సినిమా ల లో ఆ వేషాలు వేసినంత మాత్రాన ఆయనే దేవుడు కాదు అంటూ కళ్యాణి(Karate kalyani) ధ్వజమెత్తారు.ఒక వేళా ఈ విగ్రహ ఆవిష్కరణ ని ఆపకపోతే తాము ధర్నా కి దిగుతాం అని అన్నారు.మంత్రి పువ్వాడ ఈ విషయం లో జ్యోక్యం చేసుకుని ఆపాలని అన్నారు.

అయితే ‘కరాటీ కళ్యాణి'(Karate kalyani) చేస్తున్న ఈ వివాదం మీద ఎన్టీఆర్ అభిమానులు గాని ,టీడీపీ కార్యకర్తలు కానీ పెద్దగా రెస్పాండ్ కాలేదు ,ఈమె గతం లో కూడా ఇలాంటి కొన్ని విషయాల లో జ్యోక్యం చేసుకుని వార్తలో నిలవడం అలవాటు అని ఆమెని మేము పట్టించుకోము అని అంటున్నారు.ఏది ఏమైనా మే 28 న ఎన్టీఆర్ శత జయంతి ని బ్రహ్మాండంగా చేసుకుంటాము అని అంటున్నారు.

1877 views