Newsense: నవదీప్ న్యూసెన్స్ వెబ్ సిరీస్ రివ్యూ!

Posted by venditeravaartha, May 12, 2023
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

కరోనా సమయం లో ఎక్కువగా మనం ఎక్కువగా చూసినవి అన్ని కూడా వెబ్ సిరీస్ లు ,వివిధ రకాల OTT ఫ్లాట్ ఫారమ్ ల లో ఇంగ్లీష్ ,హిందీ ,మలయాళ ,తమిళ్ ,తెలుగు వెబ్ సిరీస్ ల ను చూసాం ,అయితే తెలుగు నుంచి కొన్ని వెబ్ సిరీస్ లు మాత్రమే ఉన్నపటికీ ఇప్పుడు తెలుగు లో కూడా వెబ్ సిరీస్ లు తీస్తున్నారు.నవదీప్,బిందు మాధవి ప్రధాన పాత్రా ల లో నటించిన ‘న్యూసెన్స్’ అనే వెబ్ సిరీస్ మే 12 న నుంచి ఆహా లో ప్రసారం అయింది.హీరో గానే కాకుండా సెకండ్ హీరో గా ఫ్రెండ్ గా విల్లన్ గా చేస్తూ వస్తున్న నవదీప్ మొదట సారి గా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుండటం ,కార్తికేయ 2 ,ధమాకా వంటి బ్లాక్ బస్టర్ సినిమా ల ను నిర్మించిన పీపుల్స్ మీడియా వాళ్ళు ఈ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేస్తుండటం తో మంచి అంచనాలు ఉన్నాయి .మరి ఈ న్యూసెన్స్ ఎలా ఉంది ,నవదీప్ కి వెబ్ సిరీస్ ద్వారా హిట్ వచ్చిందా లేదా అనేది చూద్దాం.

కథ:శివ (నవదీప్) రిపబ్లిక్ అనే న్యూస్ ఛానెల్ లో రిపోర్టర్ గా పని చేస్తుంటాడు,తన గర్ల్ ఫ్రెండ్ అయినా బిందు మాధవి మదనపల్లె లో ఉన్న సిటీ కేబుల్ ఛానెల్ లో యాంకర్ గా పని చేస్తూ ఉంటుంది.ప్రతి రోజు మదనపల్లె లో ఉన్న న్యూస్ ఛానెల్స్ కి చెందిన రిపోర్ట్ లు అందరు మదనపల్లె ప్రెస్ క్లబ్ లో కలుస్తూ ఉంటారు,ఈ ప్రెస్ క్లబ్ ని శివ వాళ్ళ మేనమామ అయినా ఈశ్వర్ నడిపిస్తుంటారు.ఈ పరిస్థితుల లో ఈ న్యూస్ ఛానెల్స్ అన్ని కూడా ఎవరికీ సపోర్ట్ చేయాలి అనే టాపిక్ జరుగుతూ ఉంటుంది.అధికార పార్టీ కి సపోర్ట్ చేయాలా లేక ప్రతి పక్ష పార్టీ కి సపోర్ట్ చేయాలా అనే అని నలిగిపోతుంటారు.అయితే రెండు వైపులా నుంచి డబ్బులు తీసుకుని న్యూట్రల్ గా ఉంటూ వస్తుంటారు ,ఇదే సమయం లో ప్రజల కి ప్రాబ్లెమ్ ఉన్నపటికీ కూడా వీళ్ళు పట్టించుకోరు.మరి ఎలా ఉన్న మీడియా లో పని చేస్తున్న నవదీప్ ఎవరి వైపు నిలిచాడు ,అసలు మీడియా ఎవరికోసం పని చేయాలి అనేది మిగిన కథ.

విశ్లేషణ:ప్రస్తుతం భారత దేశం లో ఉన్న మీడియా ,న్యూస్ ఛానెల్స్ గురించి చాల క్లియర్ గా చూపించారు.డబ్బులు తీసుకుని మాత్రమే న్యూస్ చెప్తున్నా కొన్ని న్యూస్ ఛానెల్స్ కి లాగి పెట్టి కొట్టినట్లు చేసారు.మీడియా నేపథ్యంగా సాగే సినిమాలు వెబ్ సిరీస్ లు రావడం చాలా అరుదుగా సాగుతూ ఉంటుంది. అయితే డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ మీడియాను ప్రధాన అంశంగా ఎంచుకొని ఇలా ఒక వెబ్ సిరీస్ తెరకెక్కించడం సాహసమే. అయితే ఇలాంటి కథను ప్రేక్షకుల ముందుకు ఆసక్తికరంగా తీసుకొచ్చే విషయంలో చాలా వరకు సఫలమయ్యాడు. ఈ న్యూసెన్స్ మొదటి సీజన్లో 6 ఎపిసోడ్లు ఉన్నాయి.మొదటి సీజన్లో చాల వరకు పాత్రల పరిచయాల కి ప్రాధాన్యత ఇచ్చిన డైరెక్టర్ ,చివర్లో మైండ్ బ్లౌలింగ్ ట్విస్ట్ ల తో ముగించాడు.చాల రోజుల నుంచి మెయిన్ లీడ్ కోసం వెయిట్ చేస్తున్న నవదీప్ ఈ సిరీస్ తో తన ఆకలి ని తీర్చుకున్నాడు ,హీరోయిన్ గా బిందు మాధవి తన పరిధి మేరకు బాగానే చేసింది.

పాజిటివ్ :నవదీప్ ,స్టోరీ ,స్క్రీన్ ప్లే ,ట్విస్ట్ లు ,మాటలు.
నెగటివ్ :సాగదీయతా ఉన్న కొన్ని సీన్ లు ,మ్యూజిక్ .
రేటింగ్ :3 .25 / 5
చివరిగా ప్రస్తుతం ఉన్న న్యూస్ ఛానెల్స్ యొక్క న్యూస్ అంత ఒక న్యూస్సేన్స్ అనే చెప్పే కథే ఈ న్యూసెన్స్.

15395 views