వేదం, హోమం…లోకాన్ని కాపాడుతాయి…ఘనంగా 26వ వేదసభ,

Posted by venditeravaartha, August 30, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]

ఎక్కడ వేదాల శబ్దం వినిపిస్తోందో ఆ ప్రాంతమంతా సుబీక్షంగా ఉంటుందని పలువురు ప్రముఖ ఘానాపాటీ లు అన్నారు. పంచారామా క్షేత్రం అయిన సామర్లకోట భీమేశ్వర ఆలయంలో 26వ వార్షిక వేద శాస్త్ర సన్మాన సభను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో బళ్ల నీలకంఠం పర్యవేక్షణలో శ్రీ బాలా త్రిపుర సుందరి వేద శాస్త్ర పరిషత్ ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో నిర్వహించారు. దీనిలో ఉభయగోదావరి, కృష్ణ జిల్లాలకు చెందిన ఘన పాటీలు, క్రమ పాటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పఠనం, చతుర్వేద పారాయణ నిర్వహించి వేదశ్వస్తితో వేద సభను ముగించారు. ఈ సందర్భంగా ప్రముఖ ఘనాపాటీలు మాట్లాడుతూ వేదం, హోమం క్రమం తప్పకుండా పాటిస్తే లోకం సుబీక్షంగా ఉంటుందన్నారు. దానికి కృషిచేస్తూ ప్రతియేటా క్రమం తప్పకుండా వేదశాస్త్ర సభను నిర్వహిస్తున్న బాలా త్రిపుర సుందరి పరిషత్ ను వారు అభినందించారు. అనంతరం ప్రముఖ పారిశ్రామికవేత్తలు దేవి ఫిషరీస్ ప్రతినిధులు చిట్టిబాబు, రాజారామ్, ఆఫ్రికన్ సిరామిక్స్ వైస్ ప్రెసిడెంట్ చిలుకూరి శ్రీకాంత్, కృష్ణమూర్తి లచే పండిత సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేద సన్మాన సభలో మాజీ మున్సిపల్ చైర్మన్ డా. చందలాద అనంత పద్మనాభం, నాయకులు కంటే జగదీశ్ మోహన్, గ్రంధి రామకృష్ణ, బిక్కిన సాయి, మూడు జిల్లాలకు చెందిన ఘనాపాటీలు, క్రమా పాటీలు, ఆలయ పండితులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు, వేద పరిషత్ నాయకులు పాల్గొన్నారు.

Tags :
45 views