భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మాకంగా ప్రారంభించిన వందే భారత్ -2 సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ రైలుకు సామర్లకోట రైల్వే స్టేషన్లో ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళుతున్న వందే భారత్ ఎక్సప్రెస్ రైలు సామర్లకోట చేరుకోగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప, జెనసేన పెద్దాపురం ఇంచార్జి తుమ్మల రామస్వామి (బాబు ), ఎమ్మెల్సీ కర్రి పద్మజా లు, బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం రమేష్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వందే భారత్ స్టేషన్ కు చేరుకోగా అతిధులు కొబ్బరి కాయలు కొట్టి స్వాగతం పలికారు. అనంతరం వారు రైలెక్కి రైలు చీఫ్ ను దుస్సాలువా, పూల మాలలతో సత్కరించి అభినందించారు. అనంతరం వారు క్రిందికి దిగి జెండా ఊపి రైలును ప్రారంభించి విశాఖపట్నం వైపునకు పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిధిలోని బిజెపి, తెదేపా, జెనసేన నాయకులు, విజయవాడ డివిజన్ పరిధిలోని, స్థానిక స్టేషన్ పరిధిలోని రైల్వే అధికారులు పాల్గొన్నారు.
Home » వందే భారత్ -2 కు ఘన స్వాగతం…
వందే భారత్ -2 కు ఘన స్వాగతం…
Posted by venditeravaartha,
March 12, 2024
[DISPLAY_ULTIMATE_SOCIAL_ICONS]
Tags :
204 views
ALSO READ
September 8, 2024
చిరంజీవి కొత్త సినిమాలో నటించనున్న యంగ్ హీరో…డైరెక్టర్ ఎవరంటే..?
September 5, 2024
బ్రేకీవెన్ కొట్టేసిన “సరిపోదా శనివారం”
September 5, 2024