Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Ntr Ramcharan: ఒక్క ఆస్కార్ అవార్డు కి ఇంత హడావిడి చేయాల్సిన అవసరం లేదు ! RRR స్టోరీ రైటర్ ‘విజయేంద్ర ప్రసాద్’

‘నాటు నాటు’ సాంగ్ కి ఆస్కార్ అవార్డు రావడం తో యావత్ భారత దేశం లో ఉన్న ప్రముఖులు అందరు తమ అభినందనలు సోషల్ మీడియా ద్వారా చెప్పారు, RRR సినిమా రైటర్ అయినా ‘విజయేంద్ర ప్రసాద్ ‘ గారు మాత్రం ఇండియన్ సినిమా కి ఆస్కార్ అవార్డు లభించడం గొప్ప విషయమే కానీ ,ఒక్క ఆస్కార్ అవార్డు మాత్రమే మన లక్ష్యం కాదు అని అలాంటి అవార్డ్స్ ఇంకా చాలా రావాలి అని అన్నారు.

రాజమౌళి గారు డైరెక్ట్ చేసిన 12 సినిమా ల లో స్టూడెంట్ నెంబర్ 1 ,మర్యాద రామన్న ,ఈగ సినిమా లు మినహా మిగిలిన 9 సినిమా ల కి స్టోరీ అందించారు రాజమౌళి గారి తండ్రి గారు ‘విజయేంద్ర ప్రసాద్ ‘ గారు. 9 సినిమా లు బ్లాక్ బస్టర్ హిట్ లు గా నిలిచాయి,బాహుబలి సినిమా తో యావత్ భారత దేశం అంతటా తన పేరు మారు మోగింది.సల్మాన్ ఖాన్ గారి కి కూడా ‘బజ్రంగి భాయిజాన్’ స్టోరీ ఇచ్చి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ ని అందించారు.

ఇక RRR సినిమా తో గ్లోబల్ స్థాయి స్టోరీ రైటర్ గా పేరు సంపాదించుకున్నారు,
విజయేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జర్నలిస్ట్ అడిగిన ఒక ప్రశ్న కి తన దైన శైలీ లో సమాధానం ఇచ్చారు. అది ఏంటి అంటే అకాడమీ అవార్డ్స్ ల లో ‘RRR ‘ సినిమా కి ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ఆస్కార్ అవార్డు లభించింది, ప్రపంచ సినిమా చరిత్ర లో ఆస్కార్ అవార్డు అల్టిమేట్, మీరు స్టోరీ అందించిన సినిమా ,అందులోను రాజమౌళి ,కీరవాణి గారు మీ ఇంటి వారే కదా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అని జర్నలిస్ట్ అడిగారు.

జర్నలిస్ట్ అడిగిన ఆ ప్రశ్న కి విజయేంద్ర ప్రసాద్ గారు సమాధానం గా ‘RRR ‘ సినిమా కి కేవలం వచ్చింది ఒక్కటే ఆస్కార్ అవార్డు అని ,దానికే మనం అంతలా సెలెబ్రేట్ చేసుకుంటున్నాము అని , 20 క్యాటగిరీ లు ఉన్న అకాడమీ అవార్డ్స్ ల లో ‘RRR ‘ కేవలం ఒక్క అవార్డు కి నామినేట్ అయింది ,విజయం సాధించింది. నెక్స్ట్ ఇయర్ కి మనం మరి కొన్ని క్యాటగిరీ ల లో నామినేట్ అవ్వాలి అని ,మరి కొన్ని ఆస్కార్ అవార్డ్స్ ని గెలవాలి అన్నారు.

హాలీవుడ్ మూవీ అయినా ‘Everything Everywhere All at Once ‘ 11 క్యాటగిరీ ల లో నామినేట్ అయింది. అందులో 7 క్యాటగిరీ ల లో ఆస్కార్ అవార్డు ల ను గెలుపొందింది .ఒక్క సారి imagine చేసుకోండి ఎంత మంచి సినిమా అది ,బ్రిలియంట్ మూవీ.ఆ స్థాయి లో మనం కూడా సినిమా లను నిర్మించాలి , ఆ లెవెల్ కి మన సినిమా ని తీసుకుని వెళ్లే విధంగా సినిమా లు తీయాలి అన్నారు.

Exit mobile version