టాలీవుడ్ లో ఎటువంటి పాత్రా ను అయినా అవలీల చేయగలిగిన నటుడు కోట శ్రీనివాస రావు గారు,మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ని ప్రారంభించిన ఈయన తరువాత విలన్ ,కమెడియన్ మరియు సపోర్టింగ్ క్యారెక్టర్ లు చేస్తూ వచ్చారు.సినిమా కోసం ఏమైనా చేయగల నటుడు దానికి ఉదాహరణ గా అప్పటి ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ గారి మీద ప్యారడీ సినిమా చేసిన వ్యక్తి కోట శ్రీనివాస రావు(Kota srinivasa rao) గారు.సినిమా ల లో ఎంత ఎనర్జిటిక్ గా కనిపించే కోట గారు బయట కూడా అంతే ఎనర్జీ తో ఉంటారు.తనకి ఏది అనిపిస్తే అది మొహం మీదనే చెప్పేస్తారు.దాని వలన అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు లేదా కోపం వస్తుంది అనేది అసలు పట్టించుకోరు..
గత కొంత కాలం నుంచి సినిమాల కి దూరంగా ఉంటున్న కోట శ్రీనివాస రావు గారు ఈ మధ్య తాను చనిపోయినట్లు వచ్చిన వార్తల మీద కొంచెం గట్టిగానే స్పందించారు.అలానే ఇండస్ట్రీ లో ఉండే సమస్యల మీద కూడా తరుచుగా ప్రశ్నిస్తారు.ఇది వరకు మా ఎలక్షన్ సమయంలో ప్రకాష్ రాజ్ ని విమర్శిస్తూ మోహన్ బాబు కుమారుడు అయినా విష్ణు కి ఆయన సపోర్ట్ ని ఇచ్చారు..ఇక అప్పుడపుడు మెగా ఫ్యామిలీ మీద కూడా విమర్శలను చేసి వార్తలో ఎక్కారు..ఇటీవల ఏర్పాటు చేసిన ఒక అవార్డు ల ఫంక్షన్ లో కోటశ్రీనివాస రావు గారు మాట్లాడుతూ అసలు ఇప్పుడు సినిమా పరిశ్రమ లేదు అని ఒక సర్కాస్ కంపెనీ లా సినిమా తయారు అయింది అన్నారు.
ఒకప్పుడు స్టార్ హీరో లు అయినా ఎన్టీఆర్ ,నాగేశ్వర రావు ,కృష్ణ ,శోభన్ బాబు లాంటి వాళ్ళు సినిమా కి ఎంత రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒక్క ప్రొడ్యూసర్ కి ఆ హీరో కి తప్ప మరెవరికి తెలిసేది కాదు.అలా ఉండటం చాల మంచి పద్ధతి అందరిలో స్నేహ వాతావరణం ఉండేది కానీ ఇప్పటి హీరో లు రోజుకి 2 కోట్లు ,6 కోట్లు తీసుకుంటున్నాము అని అందరి ముందే చెప్పేస్తున్నారు.మీరు సినిమా కి 50 కాకపోతే 100 కోట్లు తీసుకోండి కాకపోతే చెప్పకండి.మీరు ఏమి ఎల్లపుడు అలానే ఉండరు అలా చెప్పడం వలనేఇండస్ట్రీ లో వర్గ పోరు వస్తుంది అని అన్నారు.కోట శ్రీనివాస రావు గారు పవన్ కళ్యాణ్(Pawan kalyan) ,ప్రభాస్(Prabhas) పేర్లు చెప్పకపోయినా ఇది వరకు పవన్ తాను రోజుకి 2 కోట్లు తీసుకుంటా అని చెప్పిన దానిని ఉద్దేశించే కోట గారు అన్నారు అని అనుకుంటున్నారు.