VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Pushpa: ‘పుష్ప : ది రూల్’ కోసం హీరోయిన్ తో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న యాంకర్ అనసూయ

జబర్దస్త్ యాంకర్ అనసూయ(Anasuya) గురించి తెలియని సినీ ఆడియన్స్ ఉండరనే చెప్పొచ్చు. యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె జబర్దస్త్ ద్వారా ఫుల్ ఫేమస్ అయ్యారు. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు తెచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఒక స్టార్ హీరోయిన్ కు లేనన్ని సినిమాలు అనసూయ చేతిలో ఉండడం విశేషం. వరుస సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం ‘పుష్స ది రూల్’(Pushpa the rule) లో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప 1 లో అనసూయ నెగెటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు పార్ట్ 2లోనూ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో అనసూయ రెమ్యూనరేషన్ అప్పటికీ, ఇప్పటికీ రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించే రష్మిక మందానాతో సమానంగా పారితోషికం తీసుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి.

anu

జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన అనసూయ ఆ తరువాత ‘క్షణం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. యాంకర్ కాకముందు సినిమాల్లో కొన్ని సైడ్ పాత్రలు చేశారు. కానీ ఆ సమయంలో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ యాంకర్ గా ఫేమస్ అయిన తరువాత అనసూయ ఏ పాత్రలో నటించినా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అనసూయ మాత్రం తన పాత్రలను ప్రత్యేకంగా ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘రంగస్థలం’(Rangasthalam) లో అనసూయ రంగమ్మ పాత్రను ఎవరూ చేయలేరన్న విధంగా నటించింది.

దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ప్రస్తుతం అనసూయనే తీసుకుంటున్నారు. ఓ వైపు సైడ్ పాత్రల్లో నటిస్తూనే మరోవైపు ఐటెం సాంగ్స్ లోనూ అనసూయ అదరగొడుతోంది. ఇలా మల్టీపుల్ నటిగా పేరు తెచ్చుకున్న అనసూయకు సోషల్ మీడియాలో వీపరీతంగా ఫ్యాన్స్ పెరిగారు. సినిమాల్లో ఎంత బిజీ ఉన్నా.. సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేయడం అనసూయకు అలవాటు. వారు వేసే ప్రశ్నలకు, చేసే విమర్శలకు అనసూయ స్పందిస్తూ ఉంటారు.

ఇలా స్టార్ హీరోయిన్ రేంజ్ లో పేరు తెచ్చుకున్న అనసూయ..అంతేస్థాయిలో రెమ్యూనరేషన్ ను డిమాండ్ చేస్తుందట. పుష్ప పార్ట్ 1 కోసం అనసూయ రోజుకు రూ.1.15 లక్షలు వసూలు చేసిందట. అలా 12 రోజుల పాటు నటించి రూ.12 లక్షలకు పైగా వసూలు చేసిందట. ఇప్పుడు ఆ రెమ్యూనరేషన్ ను పెంచేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ రష్మిక రూ.5 నుంచి రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. అనసూయ కూడా అంతే డిమాండ్ చేస్తుందట. అయితే అనసూయకు సినిమా మొత్తం కలిపి 2 నుంచి 3 కోట్ల వరకు ఇస్తారని టాక్ వినిపిస్తోంది.

Exit mobile version