VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

YSRCP: 90 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ క్లోజ్..కొత్త నాయకుల కోసం జగన్ పడిగాపులు!

YSR Congress: గత సార్వత్రిక ఎన్నికలలో 151 సీట్లు వచ్చాయని వైసీపీ పార్టీ ఏ స్థాయిలో మిడిసిపడిందో మన కళ్లారా చూసాము. అధికారం వీళ్లకు తప్ప ఇప్పటి వరకు ఎవరికీ రాలేదని, ఆకాశం నుండి ఊడిపడిన వాళ్ళం అన్నట్టుగా వైసీపీ పార్టీ నాయకుల వ్యవహార శైలికి రాష్ట్రం చిన్నా బిన్నం అయిపోయింది. సీఎం గా జగన్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రతీ శాఖని, ప్రతీ రంగాన్ని బ్రష్టు పట్టించేసాడు. చీప్ లిక్కర్ ని అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తూ, ఆ చీప్ లిక్కర్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని నడిపాము, సంక్షేమ పథకాలు కూడా ఆ చీప్ లిక్కర్ కారణంగానే ఇచ్చాము అని ఇప్పటికీ సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారంటే వైసీపీ పార్టీ నాయకులూ ఏ స్థాయిలో దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు.

ఇవన్నీ గమనించిన జనాలు సీఎం జగన్ ని బెంగళూరు వరకు చెప్పులు విసిరి తరిమి కొట్టారు. 175 కి 175 స్థానాలు గెలవాలి అంటూ ప్రతీ సభలో ఊదరగొట్టిన జగన్ కి 11 స్థానాలు ఇచ్చారు. ఆ 11 స్థానాలు కూడా అతి కష్టం మీద వచ్చాయి. అయితే ఇప్పుడు వైసీపీ పార్టీ తన దుకాణాన్ని 90 స్థానాల్లో సర్దేసేందుకు సిద్ధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ 90 స్థానాల్లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో అయితే అసలు వైసీపీ పార్టీ నాయకులూ బయటకి వచ్చే సాహసం కూడా చెయ్యట్లేదు.

పవన్ కళ్యాణ్, చంద్రబాబు కనికరిస్తే టీడీపీ, జనసేన లోకి దూకేందుకు ఈ 90 స్థానాల్లో ఉన్న వైసీపీ నేతలు సిద్ధం గా ఉన్నారు. కానీ వీళ్ళు కేవలం నిజాయితీ గల వారినే తమ పార్టీలలో తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అధికార మదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను ఇష్టమొచ్చినట్టు తిట్టిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ ఇక రాజకీయ జీవితం ముగిసినట్టే అని అంటున్నారు.

పాతవాళ్లంతా పత్తా లేకుండా పోవడంతో సీఎం జగన్ కి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. కొత్తవారి కోసం అన్వేషిస్తుండగా, వారు వైసీపీ పార్టీ ని చూస్తేనే భయపడి పారిపోతున్నారు. పరిస్థితి చూస్తూ ఉంటే జగన్ ఇక ఎప్పటికీ కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. మరో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీఎం గా, డిప్యూటీ సీఎం గా రోజురోజుకి అద్భుతంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. జగన్ పరిపాలనకు, తమ పరిపాలనకు ఎంత వ్యత్యాసం ఉందో కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు వీళ్లిద్దరు. దానికి తోడు జగన్ ప్రవర్తన చూసి జనాలు అతన్ని మరింత అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడింది. శవాలు కనిపిస్తే రాజకీయం చెయ్యడం అతని స్వభావం, ఆ స్వభావం ఇప్పటికీ మార్చుకోలేదని మొన్న జరిగిన వినుకొండ సంఘటన ఆధారంగా నిల్చింది.

Exit mobile version