VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Guntur kaaram: గుంటూరు కారం మూవీ ని వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరు ?

కొన్ని కథ లు కొంత మందిని అనుకుని రాసుకుంటారు కానీ వేరే వారితో చేస్తారు.కొన్ని సార్లు అవి హిట్ అవుతాయి మరి కొన్ని సార్లు ప్లాప్ గా మిగులుతాయి.చివరకు ఎటువంటి రిజల్ట్ వచ్చిన తీసుకోక తప్పదు.సినిమా హిట్ అయితే మాత్రం ఫలానా హీరో ,డైరెక్టర్ ఆ సినిమా ని మిస్ చేసుకున్నారు అంటారు అదే సినిమా ప్లాప్ అయితే వాళ్ళు చేసి ఉంటె హిట్ అయ్యేది ఏమో అని కూడా అంటారు.ఇప్పుడు కూడా అలాంటి ఒక సినిమా మాట్లాడుకోబోతున్నం.సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) ,త్రివిక్రమ్ కలయిక లో రాబోతున్న గుంటూరు కారం(Guntur karam) మూవీ ని త్రివిక్రమ్ మొదట వేరే హీరో తో చేయాలి అనుకున్నారు.

guntur karam

అలా వైకుంఠ పురములో వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత గురూజీ త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుందా అనే చర్చ జోరుగా నడిచింది.అయితే మరల అల్లుఅర్జున్ కానీ ఎన్టీఆర్ తో కానీ మూవీ ఉంటుంది అనే వార్తలు వచ్చాయి.కానీ మహేష్ తో మూవీ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోసం మంచి మాస్ కథ ని రెడీ చేసారు అంట త్రివిక్రమ్(Trivikram).ఈ లోపే తాను కొరటాల శివ కి మాట ఇవ్వడం తో ఆ కథ ని మహేష్ కి వినిపించాడు త్రివిక్రమ్.అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ కి ఎన్టీఆర్ నో చెప్పే సమస్య అసలు ఉండదు అని ఇది కేవలం మహేష్ బాబు గారి కోసమే రాసుకున్న కథ అని కొంత మంది భావన.

మహేష్ ,ఎన్టీఆర్(Ntr) ఇద్దరు కూడా మంచి స్నేహితులే ఇది వరకు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ గారి భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరు అయ్యి మహేష్ గారి మీద స్నేహం ని రెట్టింపు చేసాడు.ఇక పోతే మహేష్ ,ఎన్టీఆర్ ఇద్దరి కూడా త్రివిక్రమ్ గారితో మంచి స్నేహం ఉంది దానితో వీరి కలయిక లో మూవీ అంటే తప్పకుండా భారీ అంచలనాలే ఉంటాయి.మహేష్ ,త్రివిక్రమ్ కలయిక లో రాబోతున్న మూడవ చిత్రం కావడం తో గుంటూరు కారం మీద అంచనాలు భారీగానే ఉన్నాయి.దానికి తగ్గట్లే మహేష్ బాబు గారి లుక్ ,స్టైల్ కూడా ఉండటం తో ఈ సారి సంక్రాంతి కి మహేష్ భారీ హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది.

Exit mobile version