Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Priyamani: షారుఖ్ ఖాన్, ప్రియమణి మధ్య ఉన్న సంబంధం ఏంటి?

priyamani

సినిమా హీరోయిన్లు చేసే కామెంట్లు ఒక్కోసారి పేలుతూ ఉంటాయి. వారు ఏ ఉద్దేశంతో అలా మాట్లాడుతారో తెలియదు గానీ వారు అన్న మాటలను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తుంటారు. సినిమాలో నటించే సమయంలో హీరో లేదా ఇతర వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం కామన్. కానీ కొందరు ఈ చనువును వేరేలా అనుకుంటారు. వారిపై లేని పోని రూమర్లు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్ ప్రియమణి(Priyamani), షారుఖ్ ల మధ్య కొత్త విషయాన్ని సృష్టించి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. షారుఖ్ ఖాన్(Sharukh khan), దీపీకా పదుకునే నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా గురించి తెలిసిందే. ఈ సమయంలో బాలీవుడ్ బాద్షాతో ప్రియమణికి సన్నిహితం ఏర్పడిందట. అయితే ఈ సమయంలో షారుఖ్ ఇచ్చిన ఓ గిప్ట్ ను ప్రియమని ఇప్పటికీ భద్రంగా దాచుకుందట. ఎందుకలా చేస్తుంది? అని కొందరు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నారు. ఇంతకీ అదేంటంటే?

2003లో తెలుగులో ‘ఎవరే అతగాడు’ అనే సినిమాతో ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చింది ప్రియమణి. ఆ తరువాత జగపతి బాబుతో కలిసి ‘పెళ్లైన కొత్తలో’ సినిమాతో ఫేమస్ అయింది. దీంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి.చివరికి స్టార్ హీరో బాలకృష్ణ తో కూడా ‘మిత్రుడు’ అనే సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. తెలుగులో మొత్తంగా 20కి పైగా సినిమాలు చేసిన ప్రియమని హీరోయిన్ గానే కాకుండా హీరోయిన్ ఓరియెంటేడ్ సినిమాలు కూడా చేసింది. తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించింది. తమిళంలోని పరుత్తి వీరన్ అనే సినిమాకు ప్రియమణికి జాతీయ అవార్డు వచ్చింది.

ఇక తాను ఓన్లీ హీరోయిన్ మాత్రమే చేయాలని పట్టబట్టలేదు. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమె బాలీవుడ్ బాద్షా హీరోగా వచ్చిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’(Chennai  express)లో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వచ్చింది. ఇందులో ‘ఏక్ దో తీన్ చార్’ అనే సాంగ్ లో ప్రియమణి డ్యాన్స్ కు అంతా ఫిదా అయ్యారు. ఈ సమయంలో ప్రియమణి, షారుఖ్ మద్య సన్నిహితం ఏర్పడింది. దీంతో వీరిద్దరి మధ్య ఏవేవో వార్తలు వచ్చాయి.

ఇదే సమయంలో షారుఖ్ ఖాన్ తో కలిసి ప్రియమణి ఐప్యాడ్ లో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రాంను చూశారట. అప్పుడు షారుఖ్ తన వద్ద ఉన్న రూ.300 రూపాయలను ప్రియమణికి ఇచ్చాడట. ఆ డబ్బును ప్రియమణి ఇప్పటికీ ప్రత్యేకంగా భద్ర పరుచుకుందట. ఆ సమయంలో ప్రియమణికి పెళ్లి కాలేదు. కానీ ఇప్పుడు ఓ వ్యక్తికి భార్య. మరి ఇప్పుడు కూడా ఆ రూ.300ను ఎందుకు దాచుకున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రియమణి అభిమానులు మాత్రం అభిమాన హీరో ఎంతో ప్రేమగా గిప్ట్ ఇస్తే ఎవరైనా ఇలాగే దాచుకుంటారని, దీనిపై ప్రత్యేకం చర్చ పెట్టాల్సిన అవసరం లేదని అంటున్నారు.

Exit mobile version