VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

స్వచ్ ఆంధ్ర – స్వచ్ దివాస్ కార్యక్రమంలో – బొడ్డు

స్వచ్ ఆంధ్ర – స్వచ్ దివాస్ కార్యక్రమంలో – బొడ్డు ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా పని చేద్దాం… రుడా చైర్మన్ బొడ్డు

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు పరిశుభ్రమైన వాతావరణం కోసం,మంచి ఆరోగ్యం కోసం స్వచ్ ఆంధ్రప్రదేశ్ – స్వచ్ దివస్ కార్యక్రమంలో భాగంగా కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రుడా కోతగుంట పార్కు లో స్వచ్ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రుడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి

ఈ సందర్భంగా రుడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసమే కాదు ప్రజల ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తారని….ఇందులో భాగంగానే ప్రతి నెల 3వ శనివారం “స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్” కార్యక్రమం నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు.. ప్రతినెలా మూడో శనివారం అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్ర దిశగా పని చేయాలని. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకునేలా అందరం పని చేద్దాం. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛ ఆంధ్ర అవుతుందని తెలిపారు.

Exit mobile version