Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Urvashi Rautela : బర్త్ డే రోజు బంగారు కేకు.. ఊర్వశి లెవలే వేరు.. దాని రేటెంతో తెలిస్తే షాక్


Urvashi Rautela : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం హాట్ టాపిక్‌ అయ్యాయి. అందుకు కారణం ఆమె కట్ చేసిన స్పెషల్ కేక్. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైన సంగతి తెలిసిందే. తన అందంతో దక్షిణాది ప్రేక్షకుల్లో సైతం మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఊర్వశి రౌతేలా పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న సంగతి తెలిసిందే. పలు బాలీవుడ్, సౌత్ సినిమాల్లో నటించింది. ఈ క్యూటీ ప్రత్యేక గీతాల స్పెషలిస్ట్ అని చెప్పాలి. బాలీవుడ్‌లో నటిగానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో, ప్రైవేట్ ఆల్బమ్స్‌లో నటించే ఊర్వశి రౌతేలాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక గత ఏడాది తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో రెచ్చిపోయి విజయం సాధించింది.

‘వాల్తేరు వీరయ్య’, ‘ఏజెంట్’, ‘బ్రో’, ‘స్కంద’ వంటి చిత్రాల్లో తన స్పెషల్ సాంగులతో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నెక్స్ట్ ‘విశ్వంభర’లో మళ్లీ చిరంజీవితో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఊర్వశి రౌతేలా ఈరోజు తన 30వ పుట్టినరోజు జరుపుకుంది. ఆమె పుట్టినరోజును ప్రముఖ గాయకుడు యోయో హనీసింగ్ నిర్వహించారు . లవ్ డోస్ 2 సాంగ్ సెట్స్‌లో తన పుట్టిన రోజు జరిపారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్‌గా మారాయి. అయితే ఊర్వశి బర్త్ డే సందర్భంగా ఆమె కట్ చేసిన కేక్ హాట్ టాపిక్ గా మారింది. ఊర్వశి కోసం యోయో హనీసింగ్ 24 క్యారెట్ల బంగారు పూతతో కూడిన కేక్‌ను తయారు చేశాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఆమెను ఆశ్చర్యపరిచిన హనీసింగ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఊర్వశి. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

బాలీవుడ్ న‌టి ఉర్వ‌శి రౌతేలా ఆమె వెరైటీగా బంగారు కేకు కోసింది. ఆ కేకు త‌యారీలో స్వ‌చ్చ‌మైన‌ 24 క్యార‌ట్ల బంగారం ఉప‌యోగించారు. ఇంత‌కు ఆ కేకు ఖ‌రీదు ఎంతో తెలుసా..? అక్ష‌రాల 3 కోట్ల రూపాయ‌లు. ‘ప్ర‌పంచ‌వ్యాప్తంగా సూప‌ర్ స్టార్ అయిన ఆమెకు రాజ మ‌ర్యాద‌లు చేయాల్సిందే. అందుక‌నే రూ. 3 కోట్ల విలువైన కేకు ఆమెతో కోయించాను. పూర్తిగా బంగారంతో తయారు చేసిన కేకును తీసుకొచ్చాను’ అని హ‌నీ సింగ్ తెలిపాడు. త‌న బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్ ఫొటోల‌ను ఊర్వ‌శి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఎర్ర‌ని డ్రెస్‌లో ఊర్శ‌శి కేకు క‌ట్ చేస్తున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతున్నాయి.

Exit mobile version