పెద్దాపురం మండలం తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి వారి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతల్లో మహిళలు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు దాతల సహకారంతో ఈఓ వడ్డి శ్రీనివాస్ తిరుపతి గ్రామ సర్పంచ్ శ్రీ మొయిళ్ళ కృష్ణమూర్తి వరలక్ష్మి రూపులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో పెద్దంటి పురుషోత్తమాచర్యులు నారాయణ ఆచార్యులు, మొయిళ్ళ చంటి, మత్తాల రాజు, కూనపురెడ్డి చక్రధర్, శ్రీధర్, అజయ్, భక్తులు పాల్గొనటం జరిగింది.
తొలి తిరుపతికి పోటెత్తిన మహిళలు
