Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

LIGER: లైగర్ మూవీ డిజాస్టర్ కి కారణం మా అన్న మాత్రం కాదు :ఆనంద్ దేవరకొండ

konda brothers

పెళ్లి చూపులు సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించాడు,ఇక ఆ వెంటనే ద్వారకా ,నోటా వంటి సినిమా లు చేసినప్పటికీ 2017 లో రిలీజ్ అయినా అర్జున్ రెడ్డి(Arjun reddy) సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టడమే కాకుండా యూత్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు,ఇక ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు తో తన మార్కెట్ పెరగడమే కాకుండా మంచి మంచి ఆఫర్ లు వచ్చాయి,2018 లో రిలీజ్ అయినా గీత గోవిందం సినిమా తో సక్సెస్ ఒక్కటే కాకుండా 100 కోట్ల క్లబ్ లో కూడా చేరాడు.గీత గోవిందం తర్వాత చేసిన టాక్సీవాలా మినహా మిగిలిన సినిమా లు అన్ని కూడా నిరాశనే మిగిల్చాయి అని చెప్పాలి.

ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయినా డియర్ కామ్రాడ్ ,వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా లు ప్లాప్ కావడం తో డేరింగ్ డైరెక్టర్ పూరీజగన్నాధ్ తో పాన్ ఇండియన్ సినిమా ని ప్లాన్ చేసుకున్న విజయ్ దేవరకొండ(Vijay devarakonda)  లైగర్ సినిమా తో గత ఏడాది మన ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే  ఛార్మి ,కరణ్ జోహార్ సంయుక్తంగా తీసిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి రోజు నుంచే డిజాస్టర్ టాక్ తో భారీ నష్టాలను చూసింది.ఈ సినిమా ని కొన్న బయర్స్ ఇటీవల తమని ఆదుకోవాలి అని ద్దీక్షలు కూడా చేసారు.

ఈ ధర్నా స్టార్ట్ చేసిన మొదట్లో చిత్ర దర్శకుడు పూరి జగన్నాధ్ గారు తమకి ఏదో ఒక రకంగా న్యాయం చేస్తాం అని హామీ కూడా ఇచ్చారు,కాకపోతే వారు ఎలా పడితే అలా మాట్లాడటం తో విసుగు చెందిన ఆయన మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పడం తో వారి భాధ ఇంకొంచెం ఎక్కువ అయింది.అయితే ఈ సినిమా కి విజయ్ తీసుకున్న రెమ్యూనిరేషన్ లో కొంత భాగం తిరిగి ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.బేబీ మూవీ కి సంబందించిన ప్రమోషన్ ల లో తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ ని లైగర్(Liger) సినిమా ప్లాప్ తర్వాత మీ అన్నయ్య ఎలా ఉన్నాడు ఇంట్లో అడగక,తనకి ముందుగానే సినిమా ప్లాప్ అవుతుంది తెలుసు అని తాను చేయాల్సిన కష్టం చేసాడు సినిమా రిజల్ట్ అనేది మన చేతి లో ఉండదు కదా అని తెలిపాడు.

Exit mobile version