VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

అంగ‌న్‌వాడీల స‌మ్మెకు మ‌ద్ద‌తు తెలిపిన – బొడ్డు

Boddu Venkataramana Chowdary: రాజానగరం నియోజకవర్గం సీతానగరం లో క‌నీస వేత‌నాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌, నాణ్య‌మైన ఫీడింగ్ స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్ అండ్ హెల్ప‌ర్స్ యూనియ‌న్ (సిఐటియు) ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న స‌మ్మె 3 వ రోజు కొన‌సాగింది. నాయ‌మైన త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించాల‌ని అంగ‌న్‌వాడీలు పెద్దఎత్తున నినాదాలు చేసారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం అంగ‌న్‌వాడీల‌పై బెదిరింపు దోర‌ణుల‌కు పాల్ప‌డుతుంద‌ని ఇది మంచిది కాద‌ని తెలిపారు. అంగ‌న్‌వాడీల‌ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని హెచ్చ‌రించారు. చ‌ర్చ‌ల‌కు పిలిచి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌కుండా అంగ‌న్‌వాడీల‌ను తొల‌గిస్తామ‌ని ముఖ్య‌మంత్రి చెప్ప‌మ‌న్నాడ‌ని చెప్ప‌డం చాలా దారుణ‌మ‌న్నారు. స‌మ్మె హ‌క్కు కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న‌ద‌ని దానిని ఆప‌డం ఎవ‌రి త‌రం కాద‌ని అన్నారు.

తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి అంగ‌న్ వాడీల పోరాటానికి సంఘీభావం తెలిపారు. గ్రామీణ, ప‌ట్ట‌ణ ప్రాంతంలో పేద ప్ర‌జ‌ల‌కు పౌష్టికాహారం అందిస్తున్నఅంగ‌న్‌వాడీల ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వం చాలా దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అన్నారు. గ్రాడ్యూటీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసారు. రాజ‌కీయ వ‌త్తిడులు అంగ‌న్‌వాడీల‌కు ఉండ‌కూద‌న్నారు. అంగ‌న్‌వాడీల పోరాటాన్నికి త‌మ సంపూర్ణ స‌హ‌కారం ఉంటుంద‌ని అన్నారు.

Exit mobile version