Prabhas Marriage: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే టక్కున్న గుర్తుకు వచ్చే పేరు ప్రభాస్. దాదాపు 43ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఎవరైనా పెళ్లి ఎప్పుడు అని అడిగితే చాలు చేసుకుంటా అంటూ సమాధానం దాటవేస్తున్నాడు. దీంతో యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడా అని ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి స్వయంగా ప్రభాస్ పెళ్లి తేదీపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్త దావాలంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా తన పెద్దమ్మనే ప్రభాస్ పెళ్లి గురించి వ్యాఖ్యానించడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతకీ శ్యామలా దేవీ ఏం చెప్పారు.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది ఎవరు.. ముహూర్తం ఎప్పుడని చెప్పారు తదితర వివరాలు తెలుసుకుందాం..
దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు శ్యామలా దేవి వెళ్లారు. ఆ సమయంలోనే ఆమె ప్రభాస్ పెళ్లి గురించి వివరించింది. ఆయన పెళ్లి అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి. వారిద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారని ఇప్పటికే ప్రూఫ్ చేసుకున్నారు. వారిద్దరు కలిసి బాహుబలి, మిర్చి సినిమాలో నటించారు. ఇప్పటికే చాలా సార్లు ఈ జంట పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ప్రచారం అయినప్పుడల్లా ఇద్దరి కుటుంబ సభ్యులు వార్తలు ఖండిస్తూనే వస్తున్నారు. అనుష్క కూడా ఈ వార్తలపై ఇప్పటికే ఎన్నో సార్లు ఖండించింది. అయినా కూడా మళ్లీ మళ్లీ అనుష్క పేరు తెరపైకి వస్తూనే ఉంది.
కానీ వారిద్దరూ వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్స్ కూడా. అంతేకాకుండా, వీరిద్దరికీ 40దాటినా పెళ్లి చేసుకోలేదు. దీంతో ఎప్పటికైనా ఈ జంట పెళ్లి చేసుకుని తీరుతుందని వారి అభిమానుల్లో ఎక్కడో చిన్న ఆశ మిగిలిపోయింది. ఈ సమయంలోనే శ్యామలా దేవి కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ప్రభాస్ కు త్వరలోనే పెళ్లి చేస్తామని.. అది కూడా వచ్చే దసరాలోపేనని తెలిపింది. త్వరలోనే తమ ఇంట్లో శుభకార్యం ఉంటుందని చెప్పారు. వాస్తవానికి కృష్ణంరాజు బతికుండగానే ప్రభాస్ పెళ్లి చేద్దామనుకున్నారట. ఆ సయమంలో ప్రభాస్ వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉండటం కుదరలేదట. రాధే శ్యామ్ సినిమా కంటే ముందే ఆయన పెళ్లి అని చెప్పారు కానీ అది జరుగలేదు. అప్పుడు చెప్పినట్టే మళ్లీ ఇప్పుడు కూడానా.. లేదా ఈ సారి నిజంగానే పెళ్లి చేస్తారా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ప్రభాస్ చేసుకోబోయేది అనుష్కనా లేక వేరే అమ్మాయా ఎవరై ఉంటారని ఫ్యాన్స్ దీర్ఘాలోచనలో ఉన్నారు.