Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Rajinikanth:పేదల కోసం హాస్పిటల్ నిర్మించబోతున్న రజనీకాంత్..ఎన్ని కోట్లు ఖర్చు చెయ్యబోతున్నాడో తెలుసా!

Rajinikanth : జైలర్ సినిమాతో తెలుగు తమిళ భాషలో సూపర్ హిట్ అందుకున్నరు రజినీకాంత్. ప్రపంచంలో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న హీరో రజనీకాంత్ గారు 70 ఏళ్ల వయసు పైబడిన తమ యాక్టింగ్ లో ఏ మాత్రం తగ్గని సూపర్ స్టార్ ఈ వయసులో కుర్ర హీరోలతో సైతం పోటీ పడుతున్నారు. రజినీకాంత్ తమిళ స్టార్ అయినా కూడా తెలుగులో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న హీరో మన సూపర్ స్టార్.

ప్రస్తుతం రజనీకాంత్ జై భీమ్ దర్శకుడు జ్ఞానవెల్ దశకత్వంలో ఒక మూవీలో నటిస్తున్నారు ఈ సినిమా పేరు వేదతీయన్. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఆల్మోస్ట్ అయిపోయినట్లే సమాచారం లాస్ట్ షెడ్యూల్ హైదరాబాదులో జరగనుంది. ఈ మూవీలో రానా,రితికా సింగ్,మెయిన్ రోల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఒక వార్త రజినీకాంత్ గురించి నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రకారం రజనీకాంత్ 12 ఎకరాల్లో ల్యాండ్ కొన్నట్లు ఆ ల్యాండ్ లో పేదలకు ఉచితంగా హాస్పిటల్ కడుతున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి అన్న సూపర్ స్టార్ మొదట భావించిన అది ఎందుకో కుదరలేదు.

అయినా ఆయన పేదలకు సేవ చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తారు.వారికి అవసరమైన విద్యా ఆరోగ్యం పై రజినీకాంత్ ఫోకస్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం రజనీకాంత్ చెన్నైలోని తిరుపూర్ లో ఓఎంఆర్ రోడ్డు నుండి దల్హంపూర్ వెళ్లే దారిలో, 12 ఎకరాల భూమిని కొని రిజిస్టర్ కార్యాలయముకు వెళ్లి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారుట అక్కడ ప్రజలకు ఈ విషయం తెలియడంతో భారీగా రిజిస్టర్ కార్యాలయానికి చేరుకొని తమ అభిమాన నటుడిని, చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారట అక్కడి ప్రజలతో తలైవా సెల్ఫీ కూడా దిగినట్లు సమాచారం. ఈ రిజిస్టర్ కార్యాలయంలో 12 ఎకరాల భూమిని రిజిస్టర్ చేసుకున్నది, పేదలకు ఉచితంగా హాస్పిటల్ కట్టించడానికి అని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వార్త బయటకు వచ్చింది.

Exit mobile version