తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామం శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానంలో భారీ రద్దీ – 30 వేల మంది భక్తుల దర్శనం, రూ.3.57 లక్షల ఆదాయం
కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలం: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామంలోని శ్రీ శృంగారవల్లభ స్వామి దేవస్థానంలో శనివారం (14-03-2026) భక్తుల రద్దీ భారీగా కనిపించింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూల అలంకరణ నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.

ఈ రోజు వివిధ మార్గాల ద్వారా దేవస్థానానికి ఆదాయం సమకూరింది. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,47,790, అన్నదాన విరాళాల ద్వారా రూ.77,318, కేశ ఖండన ద్వారా రూ.6,320, తులాభారం ద్వారా రూ.400, లడ్డు ప్రసాదం విక్రయాల ద్వారా రూ.25,290 లభించాయి. మొత్తం మీద దేవస్థానానికి రూ.3,57,118 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దేవస్థానం తరపున భక్తులకు ఉదయం పులిహోర ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయగా, సుమారు 5 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీ పెద్దింటి పురుషోత్తమాచార్యులు, శ్రీ పెద్దింటి నారాయణాచార్యులు, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీమతి మెయిళ్ళ సంధ్య కృష్ణమూర్తి, ధర్మకర్తలు మరియు గ్రామస్తులు కలిసి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ వివరాలను కార్యనిర్వాహణాధికారి వడ్డి శ్రీనివాసరావు వెల్లడించారు.