Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

SPY: స్పై మూవీ రివ్యూ!

spy poster

టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస పాన్ ఇండియన్ మూవీస్ చేస్తూ సూపర్ సక్సెస్ తో ఉన్న హీరో నిఖిల్ సిద్దార్ధ్.గత సంవత్సరం రిలీజ్ అయినా కార్తికేయ 2 తో తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర భాషల లో కూడా గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు తన స్పై సినిమా ని ప్రపంచ వ్యాప్తం గా దాదాపు 1600 థియేటర్ ల లో రిలీజ్ చేసారు.నూతన దర్శకుడు గ్యారి డైరెక్ట్ చేసిన స్పై మూవీ మీద భారీ అంచనాలే ఉన్నాయి.మరి ఆ అంచనాలను నిఖిల్ అండ్ టీం అందుకున్నారా ? లేక తన సూపర్ సక్సెస్ కి బ్రేక్ పడిందా అనేది ఇప్పుడు చూద్దాం..

కథ:జై(నిఖిల్ సిద్దార్ధ్) ఇండియన్ రా ఏజెంట్.తాను శ్రీలంక లో పని చేస్తుంటారు,అతను పని చేస్తున్న సమయం లో ఒక ఉగ్రవాది కి సంబంధించిన ప్రాబ్లెమ్ ని జై కి అప్పగిస్తారు.హత్య కి గురైనట్లు భావిస్తున్న కదిర్ ఖాన్ అనే ఉగ్రవాది మొదట తాను చనిపోయినట్లు నమ్మించి ఆ తర్వాత ప్రధాని కార్యాలయానికి తమ తీవ్రవాద కార్యకలాపాలకు సంబందించిన వీడియో ని పంపిస్తారు.అయితే ప్రభుత్వం ఖదీర్ ఖాన్ ని పట్టుకునే బాధ్యత ని జై కి అప్పగిస్తుంది..
ఈ ప్రక్రియలో, అతను ఈ ప్రత్యేక ఉగ్రవాది కారణంగా తాను అనుభవించాల్సిన వ్యక్తిగత నష్టాన్ని తెలుసుకుంటాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యానికి ఈ మిషన్ కి సంబంధం ఏంటి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: రా ఏజెంట్ పాత్రా లో నిఖిల్ అద్భుతంగా నటించాడు అనే చెప్పాలి ,ఐశ్వర్య మీనన్ ఒక చిన్న పాత్రను పొందింది మరియు ఆమె బాగానే ఉంది. అభినవ్ గోమతం తన కామెడీ టైమింగ్ తో పాటు గా చక్కటి నటన ని కనబరిచారు, ఆర్యన్ రాజేష్, మరకండ్ దేశ్ పాండే తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. టాలెంటెడ్ ఎడిటర్, గ్యారీ బిహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. గూఢచారి లాంటి సినిమాలు పనిచేయాలంటే స్క్రీన్‌ప్లే క్రిస్ప్‌గా, పేసీగా ఉండాలి. ఈ సందర్భంలో, తక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ వావ్ అనే అనుభూతిని పొందుతాము. BGM మరియు పాటలు బలహీనంగా ఉన్నాయి మరియు అవి చిత్రానికి విలువను జోడించవు. విజువల్ ప్రెజెంటేషన్ రిచ్ అండ్ వైబ్రెంట్ గా కనిపించడంతో సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి క్వాలిటీతో ఉన్నాయి.

పాజిటివ్:నిఖిల్ ,ప్రొడక్షన్ వాల్యూస్ ,విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.
నెగటివ్:స్క్రీన్ ప్లే ,నేతాజీ ఎపిసోడ్.
రేటింగ్:3 / 5
చివరిగా కార్తికేయ 2 తో పాన్ ఇండియన్ రేంజ్ అందుకున్న నిఖిల్ స్పై సినిమా తో ఆ రేంజ్ ని కాస్త తగ్గించుకున్నాడు అనే చెప్పాలి.మొదటి వారం అయ్యాక స్పై రేంజ్ ఏంటో తెలుస్తుంది.

 

Exit mobile version