Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Soundarya : నా కూతురు ఇప్పటికీ నన్ను కలుస్తూనే ఉంటుంది అంటూ సౌందర్య తల్లి షాకింగ్ కామెంట్స్

సినిమా హీరోయిన్ కావాలంటే నటన మాత్రమే కాకుండా గ్లామర్ షో కూడా తెలిసి ఉండాలంటారు. కానీ కొందరు వీటి జోలికి పోకుండా సాంప్రదాయంగా కనిపించాలనుకుంటారు. కానీ ఇలా ఉంటే అవకాశాలు రావని కొందరు అనుకుంటారు. నటించాలన్న కోరిక, ప్రతిభ ఉంటే ఎలాంటి వారికైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని కొందరు నిరూపించారు. వారిలో సౌందర్య ( Soundarya )ఒకరు. అలనాటి నటి సావిత్రి తరువాత అంతటి తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే హీరోయిన్ ఎవరంటే సౌందర్య తప్ప మరో హీరోయిన్ కనిపించదని అంటుంటారు. దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీని షేక చేసిన సౌందర్య ఎక్కడా గ్లామర్ జోలికి వెళ్లలేదు. అయినా ఆమె స్టార్ నటిగానే కొనసాగారు. అయితే సౌందర్య గురించి ఇప్పుడు చర్చించుకోడానికి కారణం లేకపోలేదు. అదేంటంటే?

సినిమాల్లో తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న సౌందర్య ఓ రాజకీయ పార్టీ తరుపున ప్రచారం చేయడానికి 2004 ఏప్రిల్ 17న బెంగుళూర్( Bangalore ) నుంచి హెలిక్యాప్టర్ ద్వారా బెంగుళూరు నుంచి బయలు దేరారు. చాపర్ అక్కడి నుంచి ఎగరానే ప్రమాదవశాత్తూ పేలిపోయింది. అందమైన తార ఈప్రమాదంలో చనిపోవడంతో అప్పట్లో కన్నీళ్లు పెట్టుకోని వారు లేదరనే చెప్పవచ్చు. సౌందర్య మనమధ్య లేకున్నా ఆమె సినిమాలు మనమధ్యే ఉండడంతో మనమధ్యే ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి ఆమె కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఆమెకు జన్మనిచ్చిన తల్లి పరిస్థితి ఏంటి? ఇటీవల సౌందర్య తల్లి ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని చెప్పారు. 2004 సంవత్సరంలో జరిగిన విషాద సంఘటన ఇప్పటికీ మరిపోలేనని అన్నారు.

ఈ ప్రమాదంలో ఒకేసారి తన కూతురు, కొడుకును పొగోట్టుకోవడంతో ఇంతకంటే కడుపుకోత మరొకటి ఉండదని అన్నారు. ఆ సంవత్సరమంతా ఏడుస్తూనే కూర్చున్నానని అమె చెప్పడంతో సౌందర్య అభిమానులు సైతం ఎమోషనల్ అయ్యారు. ఇక సౌందర్యను ఇప్పటికీ మరిచిపోలేదని ఆమె అన్నారు. ప్రతీరోజూ తన కలలో సౌందర్య కనిపించి నేను బాగానే ఉన్నాను అమ్మా.. అంటూ తనను పలకరించి వెళ్తుందని చెప్పారు. సౌందర్య మరణించినప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని మహిళా అభిమానులంతా తమ కుటుంబ సభ్యురాలే చనిపోయిందన్నంత బాధతో ఏడ్చారు. ఇప్పటికీ సౌందర్య సినిమా వచ్చిందంటే టీవీల ముందు నుంచి కదలరు. ఈ సమయంలో సౌందర్య తల్లి చెప్పిన విషయాన్ని విని మహిళా అభిమానులు షాక్ అవుతున్నారు.

Exit mobile version