Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Siri Hanumanth : జబర్దస్త్ షోకు సిరి హన్మంతు గుడ్ బై.. ఆమెతో గొడవ వల్లే అంటున్న నెటిజన్స్


Siri Hanumanth : బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌లో సిరి హనుమంత్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె యాంకరింగ్ ప్రారంభించి కొన్ని నెలలే అయింది. కెరీర్ స్టార్టింగ్ లోనే జబర్దస్త్ లాంటి భారీ షోకు యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉంటే ఆమె జబర్దస్త్‌కి గుడ్‌బై చెబుతోందన్న వ్యాఖ్యలు వైరల్‌గా మారుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ యూట్యూబర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులకు సుపరిచితురాలే. బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లలో ఒకరు. ప్రస్తుతం పలు షోలలో యాంకర్‌గా అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా ఉన్న ఈ క్యూటీ.. సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా కూడా అవకాశాలను దక్కించుకుంటుంది. బిగ్ బాస్ సీజన్ 6లో సిరి లవర్ శ్రీహన్ రన్నరప్‌గా నిలిచాడు. ఇద్దరూ చాలా కాలంగా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉందని.. షణ్ముఖ్ తో సిరి క్లోజ్ కావడం వల్లే దీప్తి సునైనా బ్రేకప్ చెప్పిందని చాలా రూమర్స్ వచ్చాయి.. అయినా సిరి – శ్రీహన్ ల ప్రేమలో మార్పు రాలేదు. . ఇవన్నీ కాకుండా ప్రస్తుతం సిరి కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటోంది. ప్రస్తుతం పలు షోలలో యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జబర్దస్త్‌లో యాంకర్లు వరుసగా మారుతున్నారు. గతంలో అనసూయ యాంకరింగ్ చేసేది. ఆమె స్థానంలో రష్మీ గౌతమ్ వచ్చింది. తర్వాత సౌమ్యరావు ప్రవేశించారు. కొంత కాలం తర్వాత ఆమె కూడా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ ఎంట్రీ ఇచ్చారు.

సిరి హనుమంతు కూడా జబర్దస్త్‌లో యాంకర్‌ ప్రారంభించి ఎన్ని నెలలు కావడం లేదు. ఇంతలోనే సిరి జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో దీనికి కారణం. ఈ ప్రోమోలో జబర్దస్త్ కమెడియన్ చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులలో అలాంటి అనుమానాలకు దారితీసాయి. ఈ షోలో కమెడియన్ గా వ్యవహరిస్తున్న నూకరాజు సిరి దగ్గరకు వెళ్లి.. సిరి హనుమంతు.. జస్ట్ ఫర్ వన్ మంత్ అని కామెంట్స్ చేశాడు. అవి ఎవరో కావాలని చేసిన కామెంట్స్ అని సిరి వివ‌రించింది. అయితే మీరు కంటిన్యూ అవుతున్నారా.. అని నూక రాజు అడగగా అవును నేనే కంటిన్యూ అవుతా అంటూ క్లారిటీ ఇచ్చింది. సరే చూద్దాంలే అని నూకరాజు వెటకారంగా చెప్పడంతో ఆమె షోలో ఉంటుందా.. వెళ్లిపోతుందా అనే అంశంపై అనుమానాలు మరింతగా పెరిగాయి. సిరి హనుమంతు కూడా ఎక్కువ కాలం జబర్దస్త్ యాంకర్ గా ఉండదేమో.. అనసూయ, సౌమ్య రావు లాగా గుడ్ బై చెప్పేసి తన కెరీర్ తాను చూసుకుంటుంది అంటూ పలువురు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version