Shakalaka Shankar: సినిమాల్లో ఇప్పుడూ భూతద్దం పెట్టి చూసినా కామెడీ కనిపించడం లేదు. అందుకు కమెడియన్లు లేకపోవడమే. ఇన్నాళ్లు బ్రాహ్మనందం, ఆలీ, వేణుమాధవ్, సునీల్, ఎమ్మెస్ నారాయణ లాంటి వాళ్లు తమ కామెడీతో సినిమాలను విజయవంతం చేశారు.అయితే వాళ్లు క్రమంగా సినిమాల్లో నటించడం మానేయడంతో సినిమాల్లో కామెడీ కనిపించడం లేదు. అయితే ఇటీవల కొందరు కమెడియన్లు వెండితెరపై కనిపించినా ఆకట్టుకోవడం లేదు. అంతేకాకుండా వారికి సరైన అవకాశాలు లేకపోవడంతో అలరించడం లేదు. ఇప్పుడున్న యంగ్ కమెడియన్లలో షకలక శంకర్ ఒకరు. కొన్ని సినిమాల్లో ఈయన కామెడీ ఆకట్టుకున్నా.. స్టార్ కాలేకపోయారు. అయితే ప్రస్తుతం ఆయన షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మంది కమెడియన్లను తయారు చేసింది. వీరిలో షకలక శంకర్. ఈ ప్రొగ్రాంలో చేసిన కామెడీ ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఆయన ఆ తరువాత కొన్ని సినిమాల్లో పర్ఫామెన్స్ చూపించారు. అయితే ఇటీవల ఆయన సినిమాల్లో కనిపించడం మానేశారు. కామెడీ ఓరియెంటెడ్ సినిమాలు లేకపోవడంతో షకలక శంకర్ కు సరైన అవకాశాలు రావడం లేదు. అయితే ఆయన తిరిగి జబర్దస్త్ ప్రొగ్రామ్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తనకు జీవితాన్నిచ్చిన జబర్దస్త్ నే షకలక శంకర్ నమ్ముకోనున్నట్లు తెలుస్తోంది.
స్టార్ కమెడియన్లు వెళ్లిన తరువాత జబర్దస్త్ పరిస్థితి ఆందోళనగా తయారైంది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు పలు కారణాలతో ఇతర చానెళ్లలోకి వెళ్లగా.. మరికొందరు సినిమాల్లోకి వెళ్లారు. దీంతో మల్లెమాల నిర్వాహకులు కొత్తవారికి అవకాశం ఇస్తున్నారు. అయినా కామెడీ ఆకట్టుకోకపోవడంతో ఈ ప్రొగ్రామ రేటింగ్ తగ్గిపోయింది. అయితే మరోసారి రేటింగ్ పెంచుకోవడానికి పాతవారిని తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోసినిమాల్లో అవకాశాలు రానివారు.. ఇతర చానెళ్లలో పెద్దగా గుర్తింపు పొందనివారిని మళ్లీ సొంతగూటికి తీసుకొస్తున్నారు.
ఈ క్రమంలో షకలక శంకర్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండడంతో ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో ఆయనకు ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోవడంతో జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే షకలక శంకర్ తో పాటు స్టార్ కమెడియన్లందరూ రీ ఎంట్రీ ఇస్తారా? అనే చర్చ సాగుతోంది. అలాగే జరిగితే జబర్దస్త్ మళ్లీ ఫాంలోకి వచ్చే అవకాశాలున్నాయని సినీ సర్కిల్ లో చర్చించుకుంటున్నారు.