Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Sha Rukh Khan:ప్రపంచం లోనే అత్యంత పొడవైన కారు కొనుగోలు చేసిన షారుఖ్ ఖాన్..దాని ధర ఎంతో తెలుసా!

Sha Rukh Khan: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తింపు పొందింది లిమోసిన్ కారు. ఇది హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. భారతదేశంలో దీనిని చూడటం చాలా అరుదు. ఈ పొడవైన లిమోసిన్‌లను హాలీవుడ్ సినిమాల్లో బ్యాచిలర్ పార్టీ లేదా విలాసవంతమైన జీవనశైలిని చూపించడానికి ఉపయోగిస్తారు. అందులో కూర్చుని హాయిగా ఓ మీడియం రేంజ్ పార్టీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ లిమోసిన్‌లు భారతీయ రోడ్ల పై కనిపించవు. అవి ఇక్కడ తిరగడానికి అనుమతి లేదు.

అయితే ఈ లిమోసిన్ కారు మన దేశంలో ఒకే ఒక్క హీరో దగ్గర వుంది. ఈ విలాసవంతమైన లిమోసిన్ యజమాని ఎవరో కాదు. ఆయనే బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారూఖ్. షారూఖ్ ఖాన్ కు నటనతో పాటు పలు బిజినెస్ లున్న సంగతి తెలిసిందే. అతను తన స్వంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ బ్యానర్ తో పాటు, VFX స్టూడియో కూడా ఉంది. ముంబైతో పాటు, లండన్, దుబాయ్‌లలో చాలా విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.

షారుఖ్ ఖాన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చురుకుగా ఉన్నాడు. షారూఖ్ ఖాన్ తన రాయల్ ఎస్టేట్ ను దుబాయ్ నుండి ప్రారంభించాడు. కానీ షారుఖ్ 2014లో ఈ బ్రాండ్ నుండి ఒక లిమోసిన్‌ను కూడా కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కు కుటుంబంతో ప్రయాణించడమంటే చాలా ఇష్టం. ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చిందంటే తన కుటుంబంతో కలిసి లిమోసిన్‌లో ప్రయాణించడానికి మక్కువ చూపిస్తాడు. అయితే షారుఖ్‌ కారుతో ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. 2018లో కామన్వెల్త్ సమ్మిట్‌కు ప్రధాని మోడీ హోటల్ నుంచి ఈవెంట్ జరిగే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రోటోకాల్ ప్రకారం లగ్జరీ సెడాన్ లిమోసిన్‌ను ఉపయోగించారు. 100 మీటర్ల పొడవైన ఈ కారులో ప్రధాని మోడీ మాత్రమే ప్రయాణించారు. 2014లో కూడా ఖాన్ కుటుంబం దుబాయ్ రాజకుటుంబాన్ని కలవడానికి ఈ లగ్జరీ లిమోసిన్ కారును ఉపయోగించారు. చాలా మంది భారతీయ నటులు ఇలాంటి కార్లను ఇష్టపడతారు. భారత ప్రభుత్వం లిమోసిన్లను అనుమతిస్తే, ఈ పొడవైన కార్లు మన రోడ్లపై కూడా పరుగులు పెడతాయి.

Exit mobile version