Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Roja: నోరు జారిన రోజా.. ఆ తరువాత క్షమాణలు.. భగ్గుమన్న జనసైనిక్స్

సినిమాల్లో పాపులారిటీ సాధించిన తరువాత రాజకీయాల్లోకి వెళ్లడం కామన్. నాటి ఎన్టీఆర్ నుంచి నేటి పవన్ కల్యాణ్ వరకు సినిమాలు చేసిన తరువాత పొలిటికల్ రంగంలో రాణిస్తున్నారు. వీరిలో ఒకప్పుడు హీరోయిన్లుగా చేసిన వాళ్లూ ఉన్నారు. వారిలో రోజా ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రోజా ఆ తరువాత టీడీపీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ అధినేత జగన్ అండతో తాను మంత్రి అయ్యానని రోజా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఏపీలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ క్రమంలో అనరాని మాటలు అనాల్సి వస్తోంది. ఇలా రోజా నోటీ నుంచి అనుచిత వ్యాఖ్యలు వెలువడ్డాయి. వెంటనే ఆమె సర్దుకుంది.

వైసీపీలో మంత్రిగా కొనసాగుతున్న రోజా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. తమ పార్టీపై ఎవరైనా విమర్శలు చేస్తే రోజా వెంటనే రియాక్ట్ అవుతారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు ఎలాంటి కామెంట్ చేసినా రోజా ఫైర్ అవుతారు. గత కొన్ని రోజులుగా పవన్ వారాహి విజయ యాత్ర చేస్తూ వైసీపీపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై పవన్ విమర్శలు చేశారు. వాలంటీర్లలో కొందరు సరైన విధులు నిర్వహించడం లేదని అన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ప్రతిదాడి చేస్తున్నారు.

ఇందులో భాగంగా రోజా పవన్ పై విరుచుకు పడ్డారు. వాలంటీర్ల వ్యవస్థపై విరుచుకపడుతున్న ‘నీకు తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా?’ అని అన్నారు. ఆ తరువత ‘ఇలా మాట్లాడవద్దు.. అంటూ పవన్ తల్లికి క్షమాపణలు చెప్పారు.’ రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఒక మంత్రి పదవిలో ఉండి మరో తల్లిని ఇలా అనడం సబబేనా? అదీ బాధ్యతా యుతంగా ఉండాల్సిన ఓ మహిళా ప్రజాప్రతినిధి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రోజా చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు మీమ్స్ క్రియేట్ చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలో ‘బైబై వైసీపీ’అనేలా మార్చారు. వైసీపీ మంత్రులు వీడియోలనూ ‘జగన్ ను పంపించేద్దాం’ అన్నట్లు క్రియేట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింటా తెగ చర్చ సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇలాంటి వీడియోలు పేలుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీ, జేనసేన మధ్య టగ్ ఆఫ్ వార్ అన్నట్లు సాగుతోంది. ఇక ఎన్నికల సమయానికి ఎలాంటి వీడియోలు బయటకు వస్తాయో చూడాలి.

Exit mobile version