సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామం పంచాయతీ ఆవరణలో గల వీఆర్వో కార్యాలయంలోని గ్రామ రెవెన్యూ పాత రికార్డులు శనివారం అర్ధరాత్రి అనంతరం దగ్ధం అయ్యాయి. ఎప్పటినుంచో పాత రికార్డులు సదరు భవనంలో పెట్టి తాళాలు వేయగా ఆదివారం తెల్లవారుజామున భవనం లోంచి మంటలు వ్యాపించడాన్ని గుర్తించి ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. వీ ఆర్ వో వీ. వెంకటేశ్వరి ప్రమాదానికి సంబంధించి నివేదికను తహసీల్దార్ శ్రీనివాస్ కు అందజేశారు.