Ram Gopal Varma Wife : సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి తెలియని సినీ ఆడియన్స్ ఉండరు. సమాజంలో జరిగే ప్రతి ఇష్యూపై మొదట స్పందించేది రాంగోపాల్ వర్మనే అని చెప్పొచ్చు. కొన్ని విషయాలపై ఆయన స్పందించడమే కాదు.. వాటిపై సినిమాలు తీసి తనదైన శైలిలో అభిప్రాయం చెబుతారు. రాంగోపాల్ వర్మ ( Ram Gopal Varma )ఈమధ్య సినిమాలు తీయకపోయినా… సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. సినీ,రాజకీయ విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటూ ట్రెండీగా మారుతారు. ఇంత విచ్చలవిడిగా ఉంటున్న రాంగోపాల్ వర్మ పర్సనల్ విషయాలను ఎప్పుడూ బయటపెట్టరు. కానీ ఆనోటా.. ఈనోటా.. అన్నట్లు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆయన సతీమణి రాంగోపాల్ వర్మను కొన్ని రోజుల పాటు వరుసగా కొట్టిందట. బయట పులిలా ఉన్న ఆర్జీవీ ఇంట్లో భార్య చేతిలో దెబ్బలు తిన్నాడట. అయితే అందుకో కారణం ఉంది. అదేంటంటే?
రాంగోపాల్ వర్మ రత్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆర్జీవి ఒకప్పుడు సంచలనాల సినిమాలు తీసేవారు. శివ, క్షణ క్షణం సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. తెలుగులోనే కాకుండా హిందీలోనూ బిగ్ బీ అమితాబ్ తో కలిసి సర్కార్ మూవీ తీసి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఆర్జీవి సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయన టాలెంట్ ను చూసిన రత్న గారు ఆయనను ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్నా.. ఆ తరువాత ఆర్జీవి లైఫ్ పూర్తిగా మారిపోయింది. కేవలం సినిమాలపైనే ఫోకస్ పెట్టిన ఆయన ఇంటి గురించి పట్టించుకునేవారు కాదు. ప్రతిరోజుల పొద్దుపోయాక ఇంటికి వచ్చేవారు. కొన్ని రోజులు పాటు వరుసగా మద్యం సేవించి తూలుతూ గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడేవాడు. ఇలా కొన్ని రోజుల పాటు భర్త చేసిన పనులను సహించిన ఆర్జీవి ఆ తరువాత ఒకరోజు నిలదీసిందట. ప్రతిరోజూ ఎందుకు లేట్ అవుతుందని, ఇలా పొద్దుపోయాక వస్తే కుటుంబాన్ని ఎవరు పట్టించుకుంటారని గట్టిగా అడిగిందట. అయినా ఆర్జీవీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవారట.
ఒకరోజు అలాగే రాత్రి లేట్ గా వచ్చిన తరువాత ఆర్జీవి(RGV)ని మరోసారి రత్నగారు నిలదీసిందట. అయినా సమాధానం రాకపోవడంతో జుట్టుపట్టుకొని గోడకేసి కొట్టిందట. ఇలా భర్తను ఎడా పెడా దెబ్బలు వేస్తుంటే ఆర్జీవి తండ్రి అక్కడికి వచ్చి రత్నగారిని మందిలించారట. అయితే తన భవిష్యత్ నాశనం చేశారంటూ కన్నీరు పెట్టుకుందని కొందరు పక్కన ఉన్నవారు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చాలా రోజులు భరించినా ఆర్జీవి మారకపోవడంతో చివరికి తన కూతురును తీసుకొని దూరంగా వెళ్లిందని అంటున్నారు.