Site icon VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Ram charan: ఇండియన్ సినిమా బ్రాండ్ అంబాసిడర్ గా రామ్ చరణ్!ఇప్పటి వరకు ఎవరికీ దక్కని అరుదైన గౌరవం.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ‘బాలీవుడ్'(Bollywood) మాత్రమే అనే స్థాయి నుంచి ఇండియన్ సినిమా లో హిందీ సినిమా ఒక భాగం మాత్రమే అనే రేంజ్ కి ఎదిగింది మన తెలుగు సినిమా.ఒకప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కేవలం హిందీ సినిమా మాత్రమే నామినేటెడ్ అయ్యేది.కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మొదట తెలుగు సినిమా కనిపిస్తుంది దానికి ఎంతో మంది మహానుభావులు కారణం అయినప్పటికీ ప్రస్తుతం మన తెలుగు సినిమా కీర్తి నీ నలు వైపులా వ్యాపింప చేసింది మాత్రం రాజమౌళి(Rajamouli) గారు.తన బాహుబలి సిరీస్,ఆర్ ఆర్ ఆర్ ల తో తెలుగు సినిమా ని ప్రపంచ స్థాయి కి తీసుకుని వెళ్లారు.రాజమౌళి గారికి సపోర్ట్ గా తన హీరో లు అయినా ప్రభాస్ ,రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ ల కి కూడా ఇందులో భాగం ఉంది.

ఇక బాహుబలి(Bahubali) సినిమా తో హిందీ లో మంచి మార్కెట్ ని అందుకున్న తెలుగు సినిమా, కన్నడ సినిమా ‘కెజిఫ్ ‘ తో హిందీ సినిమా ల ఆల్ టైం కలెక్షన్స్ ని కొల్లగొట్టాయి అనే చెప్పాలి.రీజనల్ సినిమా ల ని పక్కన పెట్టేసి ఇప్పుడు అంత ఇండియన్ సినిమా అనే స్థాయి కి మన సినిమా లు ఎదిగాయి.బాహుబలి సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమా లు చేస్తున్న ప్రభాస్ గారికి సరైన సక్సెస్ రావడం లేదు..కానీ ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమా తో గ్లోబల్ గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్(Ram charan) ఇప్పుడు ఇండియన్ సినిమా కి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా కి వివిధ విభాగాల లో నేషనల్ ,ఇంటర్నేషనల్ అవార్డ్స్ ల తో పాటు ఆస్కార్ అవార్డు కూడా లభించింది.ఈ అవార్డు ఫంక్షన్ ల లో మరియు ఆస్కార్ అవార్డు ల ప్రొమోషన్ ల లో రామ్ చరణ్ కి లభించిన గౌరవం అంత ఇంత కాదు.

ఇక ఆస్కార్ గెలుపొందిన తర్వాత న్యూ ఢిల్లీ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) గారితో కలిసి ఇండియా టుడే లో పాల్గొన్నారు.ఇక ఇప్పుడు కాశ్మిర్ లో జరుగుతున్న G20 సదస్సు లో ఇండియన్ సినిమా ని రామ్ చరణ్ రిప్రెసెంట్ చేస్తున్నారు.అమితాబ్ ,షారుక్ ఖాన్,సల్మాన్ ఖాన్,రజినికాంత్ ,కమల్ హాసన్,చిరంజీవి లాంటి లెజెండ్ ల కి దక్కని గౌరవం రామ్ చరణ్ కి దక్కింది.ఇక మొన్న జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల లో టాలీవుడ్ టాప్ హీరోస్ అందరు డుమ్మా కొట్టిన రామ్ చరణ్ అందుకో పాల్గొని తన వ్యక్తిత్వం ఏంటో తెలియచేసారు. హైదరాబాద్ పోలో ,ఎయిర్లైన్స్ ల లో వ్యాపార వాటాలను కలిగి ఉన్న రామ్ చరణ్ తన సినిమా ఆర్ ఆర్ ఆర్ తో 1200 కోట్ల పైన కలెక్షన్స్ సాధించడం తో G20 నుంచి ఆహ్వానం వచ్చింది.

Exit mobile version