టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్‌బాబు(Sarath babu) గారు అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్‌ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలసిందే..వెండితెర జమీందారు గా పిలవబడే శరత్‌బాబు గారు హీరో గానే కాకుండా ఎలాంటిని పాత్రా ల లో అయినా నటించగలిగిన నటుడు జులై 31 1951 లో ఆంధ్రప్రదేశ్ లో ని ఆముదాలవలస లో జన్మించిన ఈయన 1973 లో రిలీజ్ అయినా రామరాజ్యం(Rama rajyam) మూవీ ద్వారా తెలుగు సినిమా ల లోకి ప్రవేశించారు..అయితే ఆకట్టుకునే రూపం,ఎవరితో అయినా కలిసిపోయే మనస్తత్వం కలిగిన శరత్ బాబు గారు అలనాటి స్టార్ కమెడియన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా రమాప్రభ(Ramaprabha) గారితో ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితుడు అయినా లక్ష్మీకాంత్ గారి ద్వారా రమాప్రభ తో పరిచయం ఏర్పరుచుకున్నారు..అప్పట్లో వీరి మధ్య వచ్చిన పుకార్లు ని నిజం చేస్తూ వీరు ఇద్దరు 1974 లో వివాహం చేసుకున్నారు.
శరత్ బాబు -రమాప్రభ వివాహం తర్వాత శరత్ బాబు గారికి సినిమా ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలను ఇప్పించారు రమాప్రభ.రమాప్రభ గారు అప్పట్లో ఉన్న బిజీ కారణాల వలన వీరు ఇద్దరి మధ్య గ్యాప్ ఉండేది అని అప్పట్లో వార్తలు వచ్చేవి.కొన్నాళ్ళు మంచి సంసార జీవితాన్నిగడిపిన వీరు కలిసి అప్పట్లో సినిమాల కూడా నిర్మించారు.వీరి నుంచి వచ్చిన అప్పుల అప్పారావు(Appula apparao) లాంటి సినిమా ద్వారా మంచి లాభాలను కూడా పొందారు.ఇక అదే సమయం లో శరత్ బాబు గారు అటు తమిళ్ ,తెలుగు భాష ల లో బిజీ కావడం తో రమాప్రభ గారికి ,శరత్ బాబు గారికి వృత్తి రీత్యా కొన్ని విభేదాలు వచ్చాయి కొన్ని మీడియా ల లో వచ్చాయి అయితే వీటిని ఖండిస్తూ అప్పట్లో రమాప్రభ గారు ,శరత్ బాబు గారు తాము చాల హ్యాపీ గా ఉన్నాము అని చెప్పేవారు. శరత్ బాబు గారు అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో మరచిపోలేని రోజులు మూడు ఉన్నాయని ప్రకటించారు. తన పుట్టిన రోజు, రమాప్రభ పుట్టిన రోజు, తమ పెళ్లి రోజు అని చెప్పిన శరత్‌బాబు పేర్కొన్నారు. తమకు పిల్లలు లేకపోయినప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు.
14 సంవత్సరాలు ఎంతో ప్రేమ గా కలిసి ఉన్న వీరు ఇద్దరు 1988 లో విడాకులు తీసుకున్నారు.అయితే వీరు విడిపోవడానికి ముఖ్య కారణం ఆస్తి తగాదాలే అని అప్పట్లో మీడియా ల లో న్యూస్ హల్చల్ చేసింది..ఆ తర్వాత శరత్ బాబు గారు ,రమాప్రభ గారు ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ ల లో కూడా తన దగ్గర ఉన్న డబ్బులు ,ఫ్లాట్ ల ను శరత్ బాబు తన మీద రాయించుకున్నారు అని అలానే వేరే అమ్మాయి ల తో క్లోజ్ గా ఉంటున్నారు అని అందువలనే శరత్ బాబు తో విడిపోవాల్సి వచ్చింది అని చెప్పారు ..ఇక శరత్ బాబు మాట్లాడుతూ తనని ఒక పని వాడిలా మాత్రమే చూసేది అని ఒక భర్త అనే గౌరవం లేకుండా ఉండేది అని తన డబ్బులు కానీ ,ఫ్లాట్ లు కానీ ఆస్తులు కానీ తాను తీసుకోలేదు అని చెప్పేవారు..కానీ అసలు వీరు విడిపోవడానికి కారణం అయితే ఆర్ధిక లావాదేవీలు కాదు అని తమ ఇద్దరి మధ్య వచ్చిన ఇగోల(Ego) కారణల వలనే విడిపోవలసి వచ్చింది అని వీరి ఇద్దరికీ సన్నిహితంగా ఉండే వాళ్ళు చెప్తారు.తన సహాయం తో ఇండస్ట్రీ లో మంచి స్థాయి కి వెళ్లిన శరత్ బాబు..తన నే శాసించే స్థాయి కి ఎదిగాడు అని రమాప్రభ గారు,అలానే రమాప్రభ తనకి సరైన గౌరవం ఇవ్వడం లేదు అని శరత్ బాబు మనస్ఫర్థల తో విడిపోయారు అనేది ఒక వాదన ,ఏది ఏమి అయినా శరత్ బాబు తో విడిపోయాక రమాప్రభ గారు రెండవ వివాహము చేసుకోకుండా అలానే ఉండిపోయారు.