VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

Pradeep-Pawan kalyan: పవన్ కల్యాణ్ తో ప్రదీఫ్ భారీ ప్రయోగం.. సక్సెస్ అవుతుందా?

తెలుగు సినీ ప్రపంచంలో పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమా కోసం ఎదురుచూసే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. వారికోసం పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారన్న కథనాలు గతంలో వచ్చాయి. పవన్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసబెట్టి సినిమాలు తీస్తున్నాడు. ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా బిజీగా మారిపోయాడు. పవన్ కు ఉన్న డిమాండ్ తో ఆయనతో సినిమా తీయడానికి చాలా మంది డైరెక్టర్లు, నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలో యాంకర్ ప్రదీప్ పవన్ కల్యాణ్(Pawan kalyan) తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం..

pradeep

యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి స్టార్లు అయిన వారిలో ప్రదీప్(Pradeep) ఒకరు. జీ తెలుగు చానెల్లో పలు ప్రొగ్రామ్స్ లో నటించిన ఆయన ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ అనే ప్రోగ్రామ్ తో ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆయన ఇతర ఛానెళ్లలో కూడా సందడి చేస్తున్నారు. ఓ వైపు యాంకర్ గా నటిస్తూనే మరోవైపు ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే మొదట్లో సైడ్ పాత్రల్లో కనిపించిప ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అనే సినిమాతో హీరోగా మారిపోయాడు.

అయితే ఆ తరువాత ఎక్కవ ఫోకస్ అంతా యాంకరింగ్ పైనే పెట్టాడు. ఈ తరుణంలో ప్రదీప్ గురించి ఓ హాట్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. పవన్ కల్యాణ్ తో ప్రదీప్ ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడట. పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఆయనతో కలిసి ప్రదీప్ నటించారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య మంచి ప్రెండ్సిఫ్ పెరిగింది. ఆ చనువుతోనే ఆయనతో సినిమా తీయాలని ప్రదీప్ చూస్తున్నారట. అయితే ఇది నిజమేనా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై ఇప్పటి వరకైతే ప్రదీప్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రదీప్ ‘కొంచెం టచ్ లో ఉంటే చెబుతాను’ అనే షోకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా వచ్చిన డబ్బుతో పవన్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నాడట. అయితే పవన్ తో సినిమా తీయడమంటే మాటలు కాదు. కోట్లలో వ్యవహారం. ఇక మంచి డైరెక్టర్, మంచి మ్యూజిషియన్ ఇలా అన్నీ హైలెవల్లో ఉండాలి. ఏ మాత్రం అటూ ఇటూ అయినా పవన్ ఫ్యాన్స్ నుంచే విమర్శలు మొదలవుతాయి. మరి ప్రదీప్ నిజంగానే పవన్ తో సినిమా తీస్తున్నాడా? లేదా? చూడాలి.

Exit mobile version