Pothina Venkata Mahesh :జనసేన తరఫున విజయవాడలో సీటును ఆశించారు పోతిన మహేష్. కొద్దిరోజులుగా సీటు కోసం ఆందోళన చేస్తున్నారు. అయితే రీసెంట్గా జనసేనకి గుడ్ బై చెప్పేసారు జనసేన పార్టీకి పదవులకు పోతిన రాజీనామా చేసేశారు. ఏపీలో కొద్దిరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని సీటు ఆశించిన మహేష్ కు నిరాశ మిగిలింది .పొత్తులో భాగంగా కొన్ని సీట్లు బిజెపికి కేటాయించడం జరిగింది. దానిలో విజయవాడ పశ్చిమ సీటు కూడా బిజెపికి కేటాయించారు దీంతో పోతిన మహేష్ ఆందోళన చేపట్టారు.
తనకు ఎలాగైనా సీటు ఇవ్వాలని అసహనం తో ఉన్న మహేష్ ని స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలిచి మాట్లాడారు అయినప్పటికీ ఆయన అలక వీడని పరిస్థితి చివరికి సోమవారం సాయంత్రం జనసేన పార్టీ కి రాజీనామా చేస్తున్నట్లు పోతిన వెంకట మహేష్ ప్రకటించారు. జనసేనకు ఇది గట్టి దెబ్బ అని చెప్పొచ్చు. రాజీనామా చేసిన తర్వాత పవన్ పై తీవ్ర విమర్శలు కూడా చేశారు పోతిన ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన జనసేన పార్టీ నుండి విడిపోయి ఏ పార్టీలో చేరుతారో అన్న ప్రశ్న నిన్నటి వరకు అందరిలో ఉంది.ఆ ప్రశ్నకి ఈరోజు తెరపడింది.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమీపిస్తున్న ఈ తరుణంలో పార్టీలో ప్రాధాన్యత లేదని భావించిన వారు సీటు దక్కని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్లడం సహజం. ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు నేతలు తాజాగా పోతిన వెంకట మహేష్ వైసీపీలో చేరారు. కొద్దిసేపటి క్రితం సీఎం జగన్ ను కలిసేందుకు ఇంటి నుంచి బస్సుయాత్రగా పోతిన మహేష్ తరలి వెళ్లారు. తన అభిమానులతో కలిసి వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు పోతిన మహేష్.