టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కి ఉన్న ప్రేక్షక ఆదరణ అంతా ఇంతా కాదు ఆనాటి నుండి నేటి వరకు పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫాలోయింగ్ మరే హీరోకి లేదని తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రజా సేవలో ఎక్కువగా గడపడానికే ఇష్టపడతారు పవన్ కళ్యాణ్ గారు అటు రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ విజయవంతంగా ముందుకు సాగుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ప్రేక్షక అభిమానుల కు పండగ అనుకోవాలి స్టోరీ ఏమైనాప్పటికీ పవర్ స్టార్ సినిమా అంటే అభిమానులు ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాల్లో ఒక పాట పాడబోతున్నారు అనే సమాచారం అందింది. అయితే పవన్ కళ్యాణ్ గారు గతం లో కూడా ఆయన కొన్ని సినిమాలలో పాటలు పాడడం జరిగింది ఈ హరిహర వీరమల్లు సినిమాలో కూడా కీరవాణి కోరిక మేరకు పాట
పాడబోతున్నారు.
అనే సమాచారం దీనితో ఈ సినిమా పై అంచనాలు భారీగానే పెరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారు పాడబోయే పాట సినిమా టైటిల్ మీదగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ సినిమాకు ఈ పాట ప్లస్ కానుందా అనేది చూడాలి. హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది నిధి అగర్వాల్ కూడా ఈ చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా నిధి అగర్వాల్ కి మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందా అనేది చూడాలి. ఈ సినిమా 250 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది చాలా కాలం నుండి జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో రెగ్యులర్ గా షూటింగ్ జరగబోతుంది ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ కాబోతుంది అనే విషయం పై స్పష్టత రాలేదు.