Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తన మార్క్ రాజకీయం చూపిస్తే ఎలా ఉంటుందో గడిచిన ఆరు నెలల్లో మనం ఎన్నో చూసాము. స్వపక్షం, ప్రతి పక్షం లేదు, నాకు ఎవ్వరైనా ఒక్కటే అనే కాకినాడ పోర్ట్ లో ‘సీజ్ ది షిప్’ ఘటనతో అందరికీ అర్థం అయ్యేలా చేసాడు. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం వైసీపీ పార్టీ వాళ్ళే చేయడం లేదు, కూటమి నాయకులు కూడా దశాబ్దాల నుండి చేస్తూనే ఉన్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అటాక్ చేసి ఎంతో మందిని చట్టానికి చిక్కేలా చేసాడు. అయితే ఈ మాఫియా ని అడ్డుకోవడం కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కడితో అవ్వదు. అందరూ అందుకు సహకరించాలి. ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రి మాత్రమే కావడంతో, పూర్తి స్థాయి పవర్స్ ఆయన చేతిలో ఉండవు కాబట్టి చేసేదేమి లేదు.
అయితే కూటమి నేతలందరికీ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు చేసింది ఆ ఘటన. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన మరో సంచలన ఆదేశం తన అధికారులకు జారీ చేసింది. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీలు షిరిడి సాయి సంస్థపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంస్థ పై ఎలాంటి చర్యలు తీసుకుపోగా, వాళ్లకు కాంట్రాక్ట్స్ ని కూడా ఇచ్చింది. దీనిపై ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. అయితే రీసెంట్ గా షిరిడి సాయి సంస్థలకు సంబంధించిన ఆక్రమణ భూముల వివరాలను సేకరించి తనకు ఇవ్వాల్సిందిగా పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించాడు. ఇదే ఇప్పుడు కూటమి నేతల్లో ప్రకంపనలు రేపింది. విచారణ చేపడితే కచ్చితంగా దొరుకుతారు. దొరికిన తర్వాత చర్యలు చేపడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది వరకు కూడా ఆక్రమణ భూములను కనిపెట్టారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఉదాహరణకు సజ్జల రామకృష్ణ రెడ్డి, అదే విధంగా పెద్ది రెడ్డి అడవుల భూములను ఆక్రమించుకున్నారని విచారణ లో స్పష్టంగా తేలింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై తీవ్రమైన విమర్శలు తలెత్తున్నాయి. ఇప్పుడు షిరిడి సాయి సంస్థ విషయం లో కూడా కేవలం విచారణ తో సరిపెట్టి, ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మాత్రం జనాలు ఫైర్ అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఏ మేరకు చర్యలు తీసుకోబోతున్నాడో రాబోయే రోజుల్లో చూడాలి.