VenditeraVaartha: Telugu Movie News, Movie Reviews, Tollywood Latest Gossips

లీక్ అయిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ టీజర్..ఫ్యాన్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే.. మరోవైపు వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన లేటేస్టుగా నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఇంప్రషన్ కొట్టేశాడు పవన్. గ్యాంగ్ స్టర్ లెవల్లో కనిపించడంతో ఇందులో పవన్ డాన్ గా ఉంటారని అందరూ అనుకుంటున్నారు. సముద్రఖని డైరెక్షన్లో వస్తున్న ఇందులో పవన్ తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. ఇందుకు సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో అలరిస్తున్నాయి. ఇక లేటేస్టుగా ఈ మూవీకి సంబందించిన టీజర్ కట్స్ అయిపోయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అంతే జూన్ 29న టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Bro Movie Poster: Pawan Kalyan and Sai Dharam Tej Shine In Their Stylish  Avatars

పవన్ కల్యాన్ లాస్ట్ మూవీ ‘భీమ్లానాయక్’. ఈ మూవీ వచ్చిన చాలా నెలలు అవుతోంది. దీంతో పవన్ సినిమా కోసం ఫ్యాన్స ఆవురావుమంటూ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు,మూడు సినిమాలు ఉన్నాయి. క్రిష్ డైరెక్షన్లో వస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ స్టార్ట్ అయి చాలా సంవత్సరాలు అవుతోంది. కానీ ఆ తరువాత మొదలైన సినిమాలు తెరపైకి వస్తున్నాయి. లేటేస్టుగా బ్రో జూలై 28న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తరువాత పవన్ సీరియస్ మూవీస్ చేస్తున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాలో కూడా పవన్ డిఫరెంట్ గా కనిపిస్తాడని అంటున్నారు. మరోవైపు డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్ గా మంచి పేరుంది. ఈయన డైరెక్షన్లో గతంలో ‘శంభో శిశ శంభో ’ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ తో ప్రతిష్టాత్మకంగా బ్రో తీశాడు. దీంతో అటు డైరెక్టర్, ఇటు పవన్ క్రేజీతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

‘బ్రో’లో పవన్ తో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ నటిస్తున్నారు. ఇందులో బ్రహ్మానందం కూడా కనిపిస్తున్నారు. పవన్ కల్యాణ్ సినిమాల్లో గతంలో తప్పనిసరిగా ఉండేవాడు. ఇప్పుడు బ్రహ్మానందం కనిపిస్తున్నాడు. వీరితో పాటు రోహిణి, సుబ్బరాజు, తనికెళ్లభరణి, రాజా చెంబోలు కీలక పాత్రలో నటిస్తున్నారు. జీ స్టూడియో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Exit mobile version