వరుస సినిమా ల తో బిజీ గా పవన్ కళ్యాణ్ గారు 2018 అజ్ఞాతవాసి రిలీజ్ తర్వాత 2019 ఎలక్షన్ సమయం లో 3 సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఒకే సారి 3 సినిమా ల కి సైన్ చేసారు అందులో వకీల్ సాబ్,బీమ్లా నాయక్ రిలీజ్ అయ్యాయి ,2020 లోనే కమిట్ అయినా మోస్ట్ వైటెడ్ మూవీ క్రిష్ తో చేస్తున్న ‘హరి హర వీర మల్లు’ కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్రం దెబ్బతింది మరియు బడ్జెట్ భారీగా పెరిగింది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంతకం చేసి వాటి షూటింగులను పూర్తి చేసాడు కానీ ఇంకా హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయలేదు. వినోదయ సీతమ్ రీమేక్ ను కూడా పూర్తి చేశాడు.
యంగ్ సెన్సషనల్ డైరెక్టర్ సుజీత్ తో ‘OG’ మరియు గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారి తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై కూడా దృష్టి పెట్టాడు. పవన్ ప్రస్తుతం అయితే OG షూటింగ్లో ఉన్నాడు, ఈ నెలలో ఉస్తాగ్ భగత్ సింగ్ కోసం 15 రోజులు కేటాయించినట్లు సమాచారం. హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. షూటింగ్ పూర్తి కాకుండానే పవన్ సినిమాని పూర్తిగా విస్మరించినట్లు తెలుస్తుంది. OG మరియు ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క మేకర్స్ రెగ్యులర్ అప్డేట్లను పోస్ట్ చేస్తున్నారు కానీ హరి హర వీర మల్లు మేకర్స్ నుండి ఎటువంటి అప్డేట్లు లేవు. స్టార్ ప్రొడ్యూసర్ అయినా AM రత్నం గారు తన ఆశలన్నీ హరి హర వీర మల్లుపైనే పెట్టుకున్నాడు . అనుకున్న దాని కంటే సినిమా బడ్జెట్ రెండింతలు పెరిగింది. 2024 ఎలక్షన్ లు సమీపిస్తున్న సమయం లో పవన్ కళ్యాణ్ గారు త్వరలో హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎలక్షన్ లోపు సినిమా ని రిలీజ్ చేయాలి అని ఆశిస్తున్నారు.